హ్యాపీ బర్త్‌ డే రాక్సీ..హీరోయిన్‌ కు శుభాకాంక్షలు తెలియజేసిన కల్కి టీం!

Wednesday, July 24, 2024

పాన్‌ ఇండియా స్టార్‌ నటుడు ప్రభాస్‌ నటించిన సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా కల్కి 2898 ఏడీ ఈ సినిమా కోసం మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ట్రైలర్‌ సినిమా పై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. హాలీవుడ్ లెవల్‌ స్టాండర్డ్స్ తో ఉన్న ఈ ట్రైలర్ లో ప్రభాస్ తో పాటూ ముఖ్య పాత్ర పోషిస్తున్న  అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని.. పలువురు నటులను అందులో చూపించారు.

సినిమాలో వాళ్ళ క్యారెక్టర్ల పేర్లు చెబుతూ  పోస్టర్స్ ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. తాజాగా దిశా పటాని ఫస్ట్ లుక్ పోస్టర్ ను అభిమానుల ముందుకు తీసుకుని వచ్చారు. గురువారం దిశా పటాని పుట్టిన రోజు కావడంతో కల్కి మూవీ టీమ్ నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ తన క్యారెక్టర్ పేరు ‘రాక్సీ’ అని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల చేశారు.

ఈ పోస్టర్ లో దిశా గోడకు అననుకొని తన నడుము అందాలు చూపిస్తూనే మరో పక్క పవర్ ఫుల్ గా కనిపిస్తుంది.దీన్ని చూసిన నెటిజన్స్ దిశా ఈ లుక్ లో మరింత హాట్ గా కనిపిస్తుందంటూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఈ పోస్టర్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles