ఘనంగా చరణ్‌ హీరోయిన్ సీమంతం వేడుకలు!

Wednesday, January 22, 2025

ప్రముఖ నటి అమలాపాల్ అతి త్వరలో బిడ్డకు జన్మనివ్వబోతున్న విషయం అందరికీ తెలిసిందే. మొదటి వివాహం విచ్చిన్నం అయిన తరువాత ఆమె రెండో వివాహం చేసుకుంది. ఈ క్రమంలోనే ఆమె తల్లిని కాబోతున్నాను అంటూ అభిమానులకు శుభవార్త చెప్పింది.
తాజాగా ఆమె సీమంతం వేడుకలను ఘనంగా చేశారు.

గుజరాత్‌లోని సూరత్‌లో నిర్వహించిన ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. తాజాగా ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను అమలాపాల్‌ తన ఇన్‌ స్టాలో అభిమానులతో షేర్‌ చేసుకుంది. అంతేకాకుండా  ‘ప్రేమానురాగాలతో కూడిన సంప్రదాయమైన సీమంతం వేడుక’ అంటూ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది.

సీమంతం వేడుకలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి.  ఇవి చూసిన నెటిజన్లు అమలాపాల్‌ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 విజయ్‌  తో విడాకులు తీసుకున్న తరువాత అమలాపాల్ సుమారు ఆరేళ్లపాటు ఒంటరిగానే ఉంది. ఈ క్రమంలో గతేడాది రెండో వివాహం చేసుకుంది. లాంగ్‌ టైమ్‌ బాయ్‌ఫ్రెండ్‌, టూరిజం, హాస్పిటాలిటీ ప్రొఫెషనల్‌ జగత్‌ దేశాయ్తో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles