జర్నీ ఆఫ్‌ విశ్వం అంటూ వచ్చేస్తున్న గోపిచంద్‌!

Wednesday, January 22, 2025

మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వం’ ఇప్పటికే షూటింగ్ ని శరవేగంగా  జరుపుకుంటుంది. ఈ సినిమాను దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి విడుదలైన వీడియో గ్లింప్స్ ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచాయి. అయితే, ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి ‘జర్నీ ఆఫ్ విశ్వం’ అంటూ మరో వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.

ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన సీన్స్‌తో పాటు మూవీలోని కొన్ని యాక్షన్ సీన్స్‌ని కూడా  ‘జర్నీ ఆఫ్ విశ్వం’ సాంగ్‌ లో చూపెట్టారు. ఈ వీడియో చూస్తుంటే, శ్రీను వైట్ల ఈసారి ఎలాగైనా హిట్ కొట్టేందుకు తీవ్రంగా కష్టపడినట్లు  కనిపిస్తుంది. ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు కామెడీకి ఏమాత్రం కొదువ లేదని ఈ వీడియో చూస్తుంటే తెలిసిపోతుంది. శ్రీను వైట్ల తనదైన మార్క్ కామెడీతో ఈసారి ప్రేక్షకులను మరింత అలరించబోతున్నాడని సినిమా పోస్టర్స్‌ ద్వారా అయితే తెలుస్తుంది.

మొత్తానికి ఈ సినిమాతో దర్శకుడు శ్రీను వైట్లతో పాటు హీరో గోపీచంద్ కూడా సాలిడ్ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో అందాల భామ కావ్య తాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles