గుడ్ బ్యాడ్ అగ్లీ..తాజా సమాచారం ఏంటంటే!

Monday, March 31, 2025

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా త్రిష హీరోయిన్ గా చేసిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “గుడ్ బ్యాడ్ అగ్లీ” గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాపై అజిత్ కెరీర్లోనే భారీ అంచనాలు దీనిపై నెలకొనగా ఈ చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక సినిమా నుంచి వచ్చిన ప్రతీ అప్డేట్ కూడా మంచి బజ్ ని తీసుకొచ్చింది.

ఇక ఈ చిత్రంకి మొదట దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాల్సి ఉంది కానీ దానిని మరో స్టార్ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ వర్క్ చేస్తున్నాడు. ఇక తన నుంచి సాలిడ్ అప్డేట్ బయటకి వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ పనులు ఫుల్ స్వింగ్ లో చేస్తున్నట్టుగా తాను తెలిపాడు. దాదాపు ఇవన్నీ పూర్తి అయ్యిపోయాయ్ అని చెబుతున్నాడు.  ఇక ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తుండగా పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రం ఏప్రిల్ 10న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles