అఖండ 2 లో గోల్డెన్‌ లెగ్‌ బ్యూటీ!

Friday, January 24, 2025

నందమూరి నటసింహం బాలయ్య బాబు నటించిన తాజా సినిమా ‘డాకు మహారాజ్’ బాక్సాఫీస్ దగ్గర సూపర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాను దర్శకుడు బాబీ కొల్ల డైరెక్ట్ చేయగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఇప్పుడు అందరి చూపు బాలయ్య తరువాత సినిమా పై పడింది. ఇప్పటికే మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో బాలయ్య ‘అఖండ 2’ మూవీని మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాను బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ ‘అఖండ’కు సీక్వెల్‌గా రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు ‘అఖండ 2 – తాండవం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. కాగా, ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ తాజాగా ఓ బిగ్ అప్డేట్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. ఈ సినిమాలో అందాల భామ సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించబోతున్నట్లు చిత్ర యూనిట్ ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ మేరకు అఫీషియల్ పోస్టర్ కూడా వారు విడుదల చేశారు.ఇక ఈ సినిమా తొలి భాగంలో మరో బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు ఈ సీక్వెల్ మూవీగా ప్రగ్యా జైస్వాల్ స్థానంలో సంయుక్త జాయిన్ కానుందా… లేక సంయుక్త మీనన్ మరో హీరోయిన్‌గా పరిచయం కానుందా అనేది ఈ సినిమా విడుదల అయ్యాకే తెలియనుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles