వెళ్లి స్పెషలిస్టులను కాంటాక్ట్ చేయండి సార్!

Tuesday, January 21, 2025

ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జగన్ తర్వాత ఏకైక పెద్దదిక్కుగా ఉన్న నాయకుడు సజ్జల రామక్రిష్ణారెడ్డి గానే కనిపిస్తున్నారు. పార్టీ మొత్తాన్ని పునర్ వ్యవస్థీకరించేశానని అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి జిల్లా అధ్యక్షులను రాష్ట్రవ్యాప్తంగా మార్చేశారు. అయితే కొత్త అధ్యక్షులు పార్టీ బాధ్యతలను తీసుకునే కార్యక్రమాలను కూడా ఒక వేడుకలాగా నిర్వహించుకుంటున్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో దాదాపుగా అన్నింటికీ సజ్జల రామక్రిష్ణారెడ్డే ముఖ్య అతిథిగా హాజరై కొత్త సారథుల్ని ఆశీర్వదించి, వారికి టార్గెట్లు కూడా చెబుతున్నారు. ఆ క్రమంలోనే తిరుపతిలో చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా భూమన కరుణాకర్ రెడ్డి పదవీ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు సజ్జల.

ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన చెప్పిన మాటలు గమనిస్తే.. ఆయన హెల్త్ కండిషన్ మీద అనుమానాలు కలుగుతున్నాయని ప్రజలు సెటైర్లు వేసుకుంటున్నారు. ఆయన ఏం అన్నారంటే.. ‘చంద్రబాబు పాలన మొదలయ్యాక రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి, సంక్షేమం కనిపించడం లేదు. రాష్ట్రంలో ఏం జరుగుతోందో.. ఏం జరగడం లేదో ప్రజలకు చాలా బాగానే కనిపిస్తోంది. కానీ సజ్జలకు మాత్రం కనిపించడం లేదంటే.. ఆయన ఐ స్పెషలిస్టును కాంటాక్ట్ చేయాలి కదా అని జనం జోకులేసుకుంటున్నారు.

చంద్రబాబునాయుడు ప్రతిరోజూ అప్పు చేస్తున్నారట. ఈ అప్పులన్నీ ఏమైపోతున్నాయో సజ్జలకు పాపం కనిపించడం లేదుట. అదే సమయంలటో జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు మాత్రం నిర్మాణాత్మకంగా ఉన్నాయిట. ‘నిర్మాణాత్మకం’ అనే పదానికి అర్థం ఏమిటని ఈ మాజీ జర్నలిస్టు నాయకుడు అనుకుంటున్నారో బోధపడడం లేదు. ఎడాపెడా అప్పులు తెచ్చి జనానికి పంచిపెట్టేసి ఓటు బ్యాంకును తయారు చేసుకోవాలనుకున్న కుట్ర పాలన జగన్మోహన్ రెడ్డిది. పదాలకు అర్థాలు మర్చిపోయి మాట్లాడుతున్నారంటే.. సజ్జలను మంచి న్యూరాలజిస్టుకు  చూపించాల్సిందే అనేది జనం మాటగా ఉంది.

సజ్జల మాటల్లో అన్నింటికంటె హైలైట్ ఏంటంటే.. విశాఖలో రుషికొండను విధ్వంసం చేసేసి.. జగన్మోహన్ రెడ్డి తన కుటుంబం కోసం మూడు నివాస భవనాలను కట్టుకున్నారని చంద్రబాబునాయుడు ఆరోపించిన సంగతి తెలిసిందే. అంత ఖరీదుగా, డాబుసరిగా కట్టించుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు ప్రపంచంలో ఎక్కడా అలాంటివి ప్రజాస్వామ్యంలో నాయకులు తమకోసం చేసి ఉండరని కూడా అన్నారు. ఈ మాటలన్నీ సజ్జలకు మాత్రం పొగడ్తల్లాగా కనిపిస్తున్నాయి.

రుషికొండ భవనాలు చూసి.. చంద్రబాబు చాలా సంతోషపడ్డారని సజ్జల అంటున్నారు. అది వైఎస్ జగన్ నివాసం కోసం కట్టినది అని చెబుతున్న చంద్రబాబునాయుడు.. జగన్ కే ఇచ్చేయాలని సజ్జల ప్రభుత్వానికి సలహా ఇస్తున్నారు. ఇలాంటి డైలాగు కూడా వేసిన తర్వాత సజ్జల రామక్రిష్ణారెడ్డిని ఐ స్పెషలిస్టుకు, న్యూరాలజిస్టుకు మాత్రమే కాదు.. మంచి సైకియాట్రిస్టుకు కూడా చూపించాలని ప్రజలు నవ్వుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles