చర్యలు మొదలు పెట్టండి సజ్జల గారూ!

Sunday, December 22, 2024

చేసినది నీచమైన పని! అది కాస్తా బయటపడేసరికి కోపం వచ్చేసింది. ఉన్నమాట అంటే ఉలుకెక్కువ.. అనే సామెత చందంగా.. వాస్తవాలు ప్రజలకు తెలిసిపోతాయేమో అని భయపడుతున్న చందంగా.. సజ్జల రామకృష్ణా రెడ్డి.. తీవ్ర ఆగ్రహావేశాలతో నిప్పులు కురిపిస్తున్నారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన ఈనాడు దినపత్రికకు హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఎటుతిరిగీ అలాగని డిసైడ్ అయిన తరువాత ఇక మధ్యలో ఈ ప్రకటనలు ఎందుకు.. ఏకంగా ఈనాడుకు లీగల్ నోటీసు తోనే మీడియా ముందుకు రావొచ్చు కదా అని ప్రజలు అనుకుంటున్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ కు చెందిన కృష్ణా జిల్లా నాయకుడు ముంబాయికి చెందిన ఒక హీరోయిన్ తో వివాహేతర సంబంధం కొనసాగించారు. ఆమె పెళ్లి మాట ఎత్తేసరికి బెదిరించారు. ఈ విషయంలో సజ్జల జోక్యం చేసుకుని, అప్పటి విజయవాడ కమిషనర్ కాంతిరానా తాతా ను పురమాయించారు. విజయవాడ పోలీసులు ముంబాయి వెళ్లి ఆ హీరోయిన్ కుటుంబం మొత్తాన్ని అరెస్టు చేసి తీసుకువచ్చి.. రిమాండు లో ఉంచి, తర్వాత బెదిరించి.. తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకుని పంపేసినట్టుగా ఈనాడు కథనం ప్రచురించింది. దీనిపై సజ్జల మండిపడుతున్నారు.

ఒకవైపు ఈనాడు ప్రచురించిన వార్త పూర్తిగా అవాస్తవం అంటున్నారు. మరొకవైపు తన పాత్ర లేదని అంటున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంటున్నారు.

అయితే సజ్జల చట్టపరంగా చర్యలు తీసుకోవడమే కావాలని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే.. ఆయన ఈనాడు మీద లీగల్ గా ప్రొసీడ్ అయితే.. అప్పుడు ఈ కేసుకు సంబంధించి అన్ని వాస్తవాలు మళ్ళీ తిరగతోడవచ్చు. ముంబయి హీరోయిన్ అరెస్టుకు ఎందరు పోలీసు అధికారులు వెళ్లారో.. అంతా సీరియస్ గా ఆ కేసును ఎందుకు తీసుకున్నారో మొత్తం బయటకు వస్తుంది. వైసిపి నేతలు బాగోతాలన్నీ అధికారికంగా వెలుగులోకి వస్తాయని పలువురు అంటున్నారు. 

మరి సజ్జల ఈనాడు మీద నిప్పులు చెరగుతూ పెట్టిన ప్రెస్ మీట్ తో చల్లబడి ఊరుకుంటారా? లేదా, నిజంగానే కేసు పెట్టి మరింతగా వివాదంలో కురుకుపోతారా వేచి చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles