టాలీవుడ్ లో ఈ సంక్రాంతి ఫీవర్ ఆల్రెడీ మొదలై పోయింది. ఇలా సంక్రాంతికి రానున్న తాజా సినిమాల్లో నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు కొల్లి బాబీ కాంబో లో తెరకెక్కించిన భారీ యాక్షన్ మూవీ “డాకు మహారాజ్” కూడా ఒకటి. అయితే ఈ సినిమా ట్రైలర్ కోసం ఇపుడు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ ట్రైలర్ కంటే ముందు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ ట్రైలర్ వచ్చి సెన్సేషనల్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది.
అయితే ఈ ట్రైలర్ సహా సినిమాకి వర్క్ చేసిన ఎడిటర్ రూబెన్ ఇపుడు డాకు మహారాజ్ కోసం వచ్చేశారు. ప్రస్తుతం ట్రైలర్ కట్ పనుల్లో ఉన్నట్టుగా తెలిపి డైరెక్టర్ బాబీ తనపై పెట్టుకున్న నమ్మకానికి థాంక్స్ చెప్తూ ట్రైలర్ కట్ సిద్ధం అయ్యిందని కన్ఫర్మ్ చేశారు. మరి డాకు మహారాజ్ ట్రైలర్ అదిరిపోయినట్టుగా చెబుతున్నారు.