వైఎస్ జగన్మ్హోహన్ రెడ్డిలో ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరుతోంది. ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ఎన్ని కుట్రలు చేసినా, ఎంత వంకరగా వ్యవహరించినా, ఎన్ని కుటిల రాజకీయాలు చేసినా.. తన చేతలు అనుకున్న విధంగా రిజల్ట్ ఇవ్వకపోతుండడంతో ఆయన అపరిమితమైన అసహనానికి గురవుతున్నారు. రాష్ట్రంలో తాను పర్యటనలు ప్లాన్ చేసిన సందర్భాల్లో చాలా పెద్ద రచ్చలు సృష్టించాలి.. నానా బీభత్సం చేయాలి.. శాంతి భద్రతలు అదుపు తప్పిపోవాలి.. అనేది జగన్ కోరిక. అలా జరిగితే.. తనను చంపించేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని, తనకు భద్రత లేకుండాపోయిందని, తనకు ముఖ్యమంత్రితో సమానమైన భద్రత కల్పించాలని అడగాలనేది ఆయన కోరిక. అలాగే రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పిపోయాని వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలనే డిమాండ్ తో ఢిల్లీ తిరుగుతూ ఉండాలనేది ఆయన కోరిక. కానీ.. ఆయనలోని ఇలాంటి కోరికలు ఏవీ నెరవేరడం లేదు. కనీసం తన పర్యటనల్లో ఏదో రచ్చ జరిగితే.. తన మీద హత్యాప్రయత్నం జరుగుతున్నదంటూ దొంగ ఏడుపులు ఏడ్చి.. ప్రజల సానుభూతి పొందవచ్చునని అనుకుంటే.. అలాంటివి కూడా జరగడం లేదు. జగన్ కుట్రలను ముందుగానే గ్రహించిన పోలీసులు.. ఎప్పటికప్పుడు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ, జాగ్రత్తలు తీసుకుంటూ అదుపుతుప్పుతున్న పరిస్థితులు కూడా అవాంఛనీయ పరిణామాలకు దారితీయకుండా చూసుకోవడం జగన్ కు నచ్చడం లేదు. ఆయన తన కుటిల రాజకీయాలు అనుకున్నట్టుగా సాగడం లేదని విపరీతమైన ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నట్టుగా పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇలాంటి కుట్ర ఆలోచనలతోనే జగన్ రెంటపాళ్ల పర్యటనను కూడా ప్లాన్ చేసుకున్నారు. వీలైనంత అల్లర్లు, రభస సృష్టించాలనుకున్నారు. రెంటపాళ్లలో వందమందికి మించి కార్యక్రమానికి హాజరు కాకూడదని అంటూ వాహనాలకు సంబంధించి కూడా పరిమితి విధించినప్పటికీ.. పోలీసులు జగన్ దళాల ఉల్లంఘనల గురించి తమకు తెలుసు గనుక.. భారీ సంఖ్యలో పోలీసుల్ని మోహరించి.. పక్కా భద్రత ఏర్పాట్లు చేశారు. వందల సంఖ్యలో పోలీసుల్ని రెంటపాళ్లలో ఉంచారు. జగన్ దళాలు దానికి విరుగుడు ఆలోచేన చేశాయి. అక్కడ పెద్దసంఖ్యలో పోలీసులు ఉన్నారు గనుక.. తాము తలపెట్టే అల్లరి రభస జరగదు అనే సంగతి గ్రహించిన జగన్ దళాలు.. గుంటూరు నుంచి రోడ్ షోగా బయల్దేరి జనాన్ని రోడ్లమీదకు పోగేశారు.
నిజానికి ముందుగా పార్టీ ప్లాన్ లో గుంటూరు పొడవునా రోడ్ షోలాగా వెళ్లడం అనేది లేనేలేదు. కానీ.. కేవలం పోలీసుల్ని రెచ్చగొట్టి, వారిని అసహనానికి గురిచేయాలనే ఏకైక లక్ష్యంతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కానీ పోలీసులు సంయమనంతో వ్యవహరించడంతో ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు జరగలేదు. ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి తానే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా ఫలితం ఇవ్వకపోతుండేసరికి జగన్ మరింతగా ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నట్టుగా తెలుస్తోంది.
జగన్ లో పీక్స్ కు చేరుతున్న ఫ్రస్ట్రేషన్!
Tuesday, December 9, 2025
