హీరో దొరికేశాడు!

Sunday, January 19, 2025

హాస్య నటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి బలగం సినిమాతో దర్శకుడిగా మారి తొలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ అందుకున్నాడు వేణు. 2023 లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచి అవార్డులను కూడా తన ఖాతాలో వేసుకుంది. అటు ప్రశంసలతో పాటు నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది బలగం సినిమా. వేణు ఈ చిత్రానికి గాను జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా విడుదలై  ఏడాది దాటినా కూడా ఇప్పటికి మరో సినిమాని వేణు  మొదలెట్టలేదు . బలగం సినిమాను నిర్మించిన దిల్ రాజు బ్యానర్ లోనే రెండవ సినిమా కూడా చేయనున్నట్లు సమాచారం.

రెండవ సినిమా కోసం చాలా కాలం కిందటే ఓ కథ రెడీ చేసుకున్నాడు వేణు. ఆ కథ అందరి చుట్టూ తిరుగుతుంది కానీ ఎక్కడ ఫైనల్ అవ్వడం లేదు. ముందుగా ఈ కథను నేచురల్ స్టార్ నాని కి చెప్పారు. కానీ సెకండ్ హాఫ్ పట్ల నాని ఇంట్రస్ట్‌ చూపించలేదు సో అక్కడ ఒకే అవ్వలేదు. అటు నుండి మరొక యంగ్ హీరో తేజ సజ్జా వద్దకు చేరింది. ఇక్కడ దాదాపు ఒకే అని కూడా వార్తలు వచ్చాయి. కానీ అక్కడ కూడా కార్యరూపం పట్టాలేక్కలేదు. ఇక ఫైనల్ గా యంగ్ హీరో నితిన్ దగ్గరకు చేరింది.  నితిన్ కూడా వేణు ఒక నేరేషన్ ఇచ్చాడని తెలుస్తోంది.  ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్, కానీ నితిన్ ఒకే చెప్పాడని కొన్ని కరెక్షన్స్ చెప్పాడని తెలుస్తుంది.

అన్ని కుదిరితే నితిన్ తోనే ఈ సినిమా పట్టాలెక్కుతుందని సమాచారం. ఈ కథకు నిర్మాత దిల్ రాజు ఇప్పటికే యల్లమ్మ అనే టైటిల్ ను రిజిస్టర్ చేసి పెట్టుకున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles