త్వరలోనే రాజాసాబ్‌ నుంచి ఫస్ట్‌ సింగిల్‌!

Andhrawatch
1 Min Read

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ చేతినిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. గతేడాది సలార్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అభిమానులను ఆకట్టుకున్నాడు. ప్రభాస్‌ ప్రస్తుతం కల్కి 2898 ఏడీ చిత్రంలో కనిపించనున్నారు. ప్రస్తుతం ది రాజా సాబ్‌ షూటింగ్‌ లో బిజీగా గడుపుతున్నారు.

డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ చిత్రం షూటింగ్ లో ఇస్మార్ట్ శంకర్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా జాయిన్ అయ్యింది. కొద్ది రోజుల పాటు జరిగే ఈ షూటింగ్‌ లో ప్రభాస్‌ తో పాటు ఆమె కూడా పాల్గొనే సన్నివేశాలను సినిమా బృందం చిత్రీకరించనుంది.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ చిత్రం కి సంబందించిన ఫస్ట్ సింగిల్ త్వరలో విడుదల కానుంది. బేబీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ చేసిన మ్యూజికల్ పోస్ట్ కి సినిమా డైరెక్టర్‌  మారుతీ రెస్పాండ్ కావడంతో  మరింత క్లారిటీ వచ్చింది. త్వరలో ఫస్ట్ సింగిల్ కి సంబంధించిన తేదీని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

హార్రర్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్  కీలక పాత్రలో నటిస్తుండగా, మాళవిక మోహనన్ మరొక ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. 

- Advertisement -
Share This Article