తండ్రైన మంచు మనోజ్‌!

Sunday, December 22, 2024

టాలీవుడ్‌ యంగ్‌ హీరో మంచు మనోజ్‌, భూమా మౌనిక లు మరోసారి తల్లిదండ్రులయ్యారు. వీరిద్దరికీ పండంటి పాప పుట్టింది. ఈ విషయాన్ని మంచు లక్ష్మి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. మంచు మనోజ్‌, భూమా మౌనిక గతేడాది పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

వీరిద్దరికీ కూడా ఇది రెండవ వివాహామే. భూమా మౌనికకు ఇంతకు ముందే పెళ్లై ఓ బాబు కూడా ఉన్నాడు. మంచు మనోజ్‌ తన భార్య ప్రణీత రెడ్డి తో విడాకులు తీసుకున్న తరువాత వీరిద్దరూ ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. కొంత కాలం క్రితం తాము తల్లిదండ్రులం కాబోతున్నామని మంచు మనోజ్‌ స్వయం గా ప్రకటించారు.

ఆ తరువాత ఆళ్లగడ్డలో  సీమంతం వేడుకను ఘనంగా జరిపించారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.. తాజాగా మౌనిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.. ఈ విషయాన్ని మంచు లక్ష్మీ సోషల్ మీడియా ద్వారా తెలిపారు..మనోజ్ , మౌనిక మరోసారి తల్లితండ్రులయ్యారు. మా ఇంట్లో దేవత వచ్చింది. మనోజ్ , మౌనిక దంపతులు పాపకి జన్మనిచ్చారు. అన్నగా ధైరవ్ సంతోషిస్తున్నాడు. అప్పుడే తనకి నిక్ నేమ్ కూడా పెట్టారు.. శివయ్య ఆశీస్సులు మా కుటుంబం పై ఎప్పటికి ఇలానే ఉండాలని కోరుకుంటున్నా అని మంచు లక్ష్మీ ట్వీట్ లో పేర్కొంది..

పోస్ట్ వైరల్ గా మారగా మనోజ్ – మౌనిక దంపతులకు అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. అంతేకాదు మంచు మనోజ్, మౌనికలు మొన్నీమధ్య కొత్త బిజినెస్ ను మొదలు పెట్టిన విషయం తెలిసిందే.. మనోజ్ కేరీర్ విషయానికొస్తే.. సినిమాను చేస్తున్నాడు.. అలాగే షోలు కూడా చేస్తున్నాడు..

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles