కన్నడ చిత్రసీమకు చెందిన ప్రముఖ హాస్య నటుడు బ్యాంక్ జనార్దన్ సోమవారం మృతి చెందారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఆయన ఈ రోజు ఉదయం చనిపోయారు. మొదట ఆరోగ్య సమస్యలతో బెంగళూరు మణిపాల్ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. మొదట్లో కోలుకుంటున్నట్లు కనిపించినా.. చివరకు చికిత్స సమయంలోనే తుదిశ్వాస విడిచారు. బ్యాంక్ జనార్దన్ 500కు పైగా సినిమాల్లో నటించారు.
తెలుగులో ఖననం, రిదం, లాస్ట్ పెగ్, ఉపేంద్ర 2 తదితర సినిమాల్లో ఆయన యాక్ట్ చేశారు. 1948లో జన్మించిన ఈయన తొలుత బ్యాంకులో పని చేసి, నాటక, చిత్ర రంగాల్లోకి ప్రవేశించారు. బ్యాంక్ జనార్దన్ మృతి పట్ల కన్నడ పరిశ్రమ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి’ అని కన్నడ సినీ అభిమానులు వేడుకుంటున్నారు. మా 123తెలుగు.కామ్ తరఫున బ్యాంక్ జనార్దన్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.