తిరువూరు తెలుగుదేశం పార్టీ అంతర్గత సంక్షోభం దాదాపుగా ఒక కొలిక్కి వచ్చినట్లే. ఎమ్మెల్యే అయిన తర్వాత అపరిమిత దురహంకారాన్ని ప్రదర్శించిన అమరావతి ఉద్యమనేత కొలికపూడి శ్రీనివాసరావు ఒక మెట్టు దిగివచ్చారు. పార్టీ పెద్దలు జోక్యం చేసుకోవడంతో ఆయన తన తప్పు తెలుసుకున్నారు. తన వైఖరి వల్లనే పార్టీ కార్యకర్తలలో అసంతృప్తి ఏర్పడిందని తాను తీరు మార్చుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. మొత్తానికి తాను ఎమ్మెల్యేగా ఉన్నానని అహంకారంతో విర్రవీగకుండా ఆయన ప్రాక్టికల్ గా మాట్లాడడం పార్టీకి శుభపరిణామం. పార్టీ నాయకుల మధ్య తిరిగి సయోధ్య వాతావరణంలో నెలకొల్పడానికి ఆదివారం నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఇన్నాళ్లుగా జరుగుతున్న పరిణామాలపై ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు తన వివరణ ఇస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే పార్టీ కార్యకర్తలలో అసంతృప్తి పూర్తిగా చల్లారాలంటే, వారు యథాపూర్వం తమ నాయకుడితో కలిసి మెలిసి పనిచేయాలంటే ఆయన కేవలం ఎవరైనా ఇస్తే చాలదు, క్షమాపణ కూడా అడగాలి అని నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
ఎన్డీఏ కూటమి పార్టీల తరఫున రాష్ట్రంలో మొత్తం 164 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వీర అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే. సుదీర్ఘకాలం పార్టీలో పనిచేసిన అనుభవం లేకపోయినప్పటికీ.. సుదీర్ఘకాలం పార్టీలో పనిచేసిన అనుభవం లేకపోయినప్పటికీ.. వైల్డ్ కార్డు ఎంట్రీ లాగా చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికలలో కొందరికి అవకాశం కల్పించి ఎమ్మెల్యేలను చేశారు. అలాంటి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కూడా ఒకరు. అమరావతి రాజధాని కోసం అలుపెరగని పోరాటం సాగించిన అనుభవం ఆయనకు ఎనలేని గుర్తింపును తీసుకువచ్చింది. అదే అర్హతగా చంద్రబాబు ఎమ్మెల్యేని చేశారు. ఏరా గెలిచిన తర్వాత స్థానిక పార్టీ శ్రేణులను విస్మరించడం వారి పట్ల దురుసుగా ప్రవర్తించడం ఆయనకు అలవాటుగా మారింది. స్థానిక విలేకరులను కూడా అసభ్యంగా దుర్భాషలాడుతూ విమర్శల పాలయ్యారు. వారందరూ పార్టీకి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. స్థానికంగా నియోజకవర్గంలో ఉండే మహిళా ఉద్యోగులకు అర్ధరాత్రి వేళలో అసభ్యసందేశాలు పంపుతూ వేధిస్తున్నారనే ఆరోపణ ఆయనపై పడిన నిందలలో పరాకాష్ట. పరిస్థితి చేయిదాటకముందే అధిష్ఠానం స్పందించింది. నారాలోకేష్ , కొలికపూడికి అక్షింతలు వేసినట్టుగా పార్టీలో వినిపిస్తోంది. వర్లరామయ్య, కేశినేని చిన్ని తదితరులు పిలిచి తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఆదివారం తిరువూరు పార్టీ కార్యర్తలతో సమావేశం పెట్టారు. ఆ సమావేశంలో కొలికపూడి కేవలం ఇన్నాళ్ల తన వైఖరి గురించి వివరణ చెబితే సరిపోదని, పార్టీ కార్యకర్తలంతా మనస్ఫూర్తిగా మళ్లీ సహకరించాలంటే.. క్షమాపణ కూడా చెప్పాలని పలువురు అంటున్నారు.