ప్రతిశనివారం: హిందూపురం టూ నగరంపాలెం!

Monday, December 8, 2025

ఒక మామూలు పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా ఉంటూ మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డిని మీసం మేలేసి అసభ్యపదజాలంతో దూషించినప్పుడు.. మహా అయితే జగన్ కళ్ళలో ఆనందం చూడగలననే ఉద్దేశం తప్ప ఆయన మరొకటి అనుకుని ఉండకపోవచ్చు! జగన్మోహన్ రెడ్డి తనతో ఉద్యోగానికి రాజీనామా చేయించి.. హిందూపురం నుంచి ఎంపీగా గెలిపించి.. దేశంలో అత్యున్నత నిర్ణాయక చట్టసభలో ప్రజల ప్రతినిధిగా కూర్చోబెట్టినప్పుడు.. తన దూకుడుకు అది అద్భుతమైన గుర్తింపు అని మురిసిపోయి ఉంటారే తప్ప, భవిష్యత్తు పర్యవసానాలు మరోరకంగా తన పరువు తీస్తాయనే ఆలోచన ఆయనకు కలిగి ఉండకపోవచ్చు! హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇప్పుడు ఎలాంటి పరిస్థితికి చేరుకున్నారో చూస్తే జాలి కలుగుతుంది! ఒక సాధారణ ఖైదీలాగా బెయిలు వచ్చిన తర్వాత ప్రతి శనివారం గుంటూరులోని నగరం పాలెం పోలీస్ స్టేషనుకు హాజరై సంతకాలు చేయాలి. అంటే హిందూపురంలో ఉండే గోరంట్ల మాధవ్ ప్రతి శనివారం నగరం పాలెం పోలీస్ స్టేషనుకు  ఈ కేసు తేలేంత వరకూ యాత్రా స్పెషల్ నడుపుతూ ఉండాల్సిందే అన్న మాట! కేవలం జగనన్న కళ్లలో ఆనందం చూడడం కోసం పోలీసుల మీదే దౌర్జన్యం చేయడం, వారి అదుపులో ఉన్న నిందితుడి మీద దాడి చేయడం వంటి దుర్మార్గాలకు పాల్పడిన ఫలితాన్ని ఇప్పుడు గోరంట్ల మాధవ్ అనుభవిస్తున్నారు!!

పాపిరెడ్డి పల్లెలో జగన్మోహన్ రెడ్డి పర్యటించిన తర్వాత ఆయన ప్రాణానికి ముప్పు వచ్చేసిందంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ పెద్దపెట్టున గగ్గోలు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ క్రమంలో గత ఎన్నికలకు ముందు నుంచి పార్టీలో లూప్ లైన్‌లో ఉంటున్న గోరంట్ల మాధవ్- జగన్ భజన చేయడం ద్వారా మళ్ళీ లైమ్ లైట్ లోకి రావచ్చని ఆశపడ్డారు. ప్రత్యేకంగా తాడేపల్లికి వచ్చి మరి అక్కడి పార్టీ ప్రధాన కార్యాలయంలో జగన్ భద్రత గురించి మాట్లాడుతూ, పాపిరెడ్డి పల్లె పోలీసులను దుర్మార్గంగా చిత్రించడానికి సాహసిస్తూ ఆయన తన వంతు పాత్ర పోషించారు. అయితే అదే సమయంలో వైయస్ భారతి మీద అసభ్య పోస్టులు పెట్టిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ను పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. నిందితుడిని పోలీసులు తరలిస్తున్న సంగతిని తన వేగులద్వారా తెలుసుకున్న గోరంట్ల మాధవ్ ఎగబడి పోలీసు వాహనాన్ని వెంబడించి, వారిని అడ్డుకోవడం పోలీసుల మీద దౌర్జన్యం చేయడం.. వారి అదుపులోనికి కిరణ్ మీద దాడి చేయడం జరిగింది. ఈ కేసులో ఆయన అనుచరులు ఆయన మరియు అనుచరులు కూడా అరెస్టు అయ్యారు. మొన్నటిదాకా రిమాండ్ లోనే ఉన్నారు. ఒక విడత పోలీసులు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించినప్పటికీ స్పష్టమైన సమాధానాలు చెప్పని గోరంట్ల మాధవ్ కు కోర్టు షరతులతో కూడిన బయలు మంజూరు చేసింది. నిజానికి అసభ్య పోస్టులు పెట్టిన చేబ్రోలు కిరణ్ కు ఎప్పుడో బెయిలు లభించింది. అతడిమీద దాష్టీకం చేసిన మాధవ్ కు ఇప్పుడు లభించింది.  కోర్టు తీర్పు  ప్రకారం గోరంట్ల మాధవ్ అతనితో పాటు అరెస్టు అయిన మరో ఐదుగురు అనుచరులు కూడా ప్రతి శనివారం నగరం పాలెం లోని పోలీసు స్టేషనుకు హాజరై సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. సిఐ నుంచి ఎంపీగా ఎదిగిన మాధవ్ చివరికి మామూలు ఖైదీ లాగా స్టేషనుకు వారం వారం వచ్చి సంతకాలు పెట్టే పరిస్థితికి దిగజారి పోవడం ఆయన స్వయంకృతమేనని అందరూ అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles