జగన్మోహన్ రెడ్డి ఈగోమీద, అహంకారం మీద ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చాలా సుతిమెత్తగా ఒక బ్రహ్మాస్త్రం ప్రయోగించారు. ఇది జగన్మోహన్ రెడ్డికి ఊపిరి ఆడనివ్వని అస్త్రం అది. జగన్ ఒక వేళ మళ్లీ ముఖ్యమంత్రి అయినా సరే.. ఒక్క అడుగు కూడా వేయలేని అస్త్రం అది. ఇదివరకటి నిర్ణయానికి కట్టుబడి ఉండలేక, అలాగని ఆ నిర్ణయాన్ని మార్చుకోలేక మధనపడిపోయే పరిస్థితిని సృష్టించేశారు చంద్రబాబునాయుడు. వివరాల్లోకి వెళితే..
ఉండవిల్లిలో చంద్రబాబునాయుడు నివాసం సమీపంలో ప్రజావేదికను అప్పట్లో చంద్రబాబు నిర్మించారు. జగన్ అధికారంలోకి రాగానే.. తన తొలి ప్రయత్నంగా.. దాన్ని కూల్చివేశారు. కూల్చివేయడం ఆయన బుద్ధి వరకు నిజమే. కానీ.. కనీసం ఆ శిథిలాలను తొలగించకుండా, ప్రతిరోజూ చంద్రబాబు వాటిని చూసి విలపిస్తూ ఉండాలనే కోరికతో అలాగే వదిలేశారు.
ఇప్పుడు చంద్రబాబునాయుడు.. ప్రజావేదిక శిథిలాలను.. జగన్మోహన్ రెడ్డి విధ్వంసక మనస్తత్వాన్ని ఎప్పటికీ గుర్తుకు తెచ్చే ఒక స్మారక స్తూపంలాగా అలాగే వదలివేయాలని, దాని స్థానంలో మరొకటి నిర్మించరాదని నిర్ణయించారు. వాటిని అమరావతి రాజధాని సందర్శకులకు ప్రత్యేకంగా చూపిస్తారు. దీనివల్ల.. తెలుగుజాతి ఎప్పటికీ.. జగన్మోహన్ రెడ్డి బుద్ధిని, విధ్వంసక మనస్తత్వాన్ని తెలుసుకుంటూ ఉంటుంది. అది జగన్ కు ఎప్పటికీ ముల్లులా గుచ్చుతూనే ఉంటుంది.
ఇప్పుడు జగన్ ఎలాంటి సంకట స్థితిలో పడ్డారంటే ఒకవేళ్ల మళ్లీ ఏనాటికైనా ఆయన మరోసారి గెలవడం అంటూ జరిగినా కూడా శిథిలాల విషయంలో నిర్ణయం తీసుకోలేరు. వాటిని తొలగిస్తే.. ఆయన తన అహంకారాన్ని చంపేసుకుని, ఓటమిని అంగీకరించినట్టుగా ఉంటుంది. అలాగని తొలగించకపోతే.. జగన్ బుద్ధిని ప్రచారం చేయడానికి అదొక ఎగ్జిబిట్ లాగా ప్రదర్శించాలని చంద్రబాబు అనుకున్న వ్యూహానికి లోబడి పోయినట్లు అవుతుంది. అందుకే జగన్ మాత్రం మళ్లీ గెలిచినా సరే.. ఆ పనిచేయలేరు.. అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.
జగన్ మళ్లీ గెలిచినా.. ఆ పని చేయలేరు!
Sunday, December 22, 2024