ఎలక్షన్లు పోతున్నాయ్! ఇక్కడైనా లాభపడదాం!

Monday, June 24, 2024

ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సంపాదించుకోవాలనేది సామెత! రాజకీయాల్లో పోగొట్టుకున్నప్పుడు.. రాజకీయాల్లోనే సంపాదించుకోవాలి.. ఈ సామెతకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇస్తున్న ఆధునిక రూపం ఇది. కాకపోతే రాజకీయాలలో ఒక మార్గం ద్వారా పోగొట్టుకొని.. మరొక మార్గం ద్వారా సంపాదించుకోవాలని ఆరాటపడుతుండడమే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. దీంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో భారీగా ఖర్చుపెట్టి ఓటమి భయంతో డీలాపడిన నేతలు, బెట్టింగ్ పర్వం మొదలు కాగానే కాస్త యాక్టివేట్ అవుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని బెట్టింగులు కాస్తూ అయిన కాడికి ఆ రూపంలో అయినా డబ్బు సంపాదించుకోవచ్చని వైసీపీ నేతలు తొందరపడుతున్నారు.

రాష్ట్రంలో బెట్టింగ్ పర్వం మహజోరుగా నడుస్తోంది. తమాషా ఏంటంటే.. తెలుగుదేశం కూటమి గెలుపు మీద బెట్టింగులో ఎక్కువగా సాగుతున్నాయి. తెలుగుదేశాన్ని వ్యతిరేకించే వాళ్లు కూడా ఆ పార్టీలోని కూటమిలోని సెలబ్రిటీల మెజారిటీ మీద పందేలు కడుతున్నారు తప్ప.. ఓడిపోతారని పందెం కట్టడానికి ముందుకు రావడం లేదు.

ఇలాంటి పరిస్థితిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక చిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికలు పూర్తయిన నాటినుంచి ఆ పార్టీ నాయకులు పూర్తిగా సైలెంట్ గానే ఉండిపోయారు. ఓటమి భయం వారిని వెన్నాడుతూ వచ్చింది. ఎక్కడా బయటకు రాలేదు కూడా. కొన్ని రోజుల తర్వాత ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లిన జగన్మోహన్ రెడ్డి.. 151 కంటె ఎక్కువ స్థానాలు గెలిచిన తర్వా.. ‘అధినేత ధీమా’ను తామందరమూ చూపించాలని పార్టీలో అందరూ ఆరాటపడుతున్నారు. ఏ స్థాయి నాయకులు ఆ స్థాయిలో తమ పార్టీ గెలుస్తుందని గట్టిగానే చెబుతున్నారు. సంభాషణల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందనే మాట ధాటిగా చెబుతున్న వాళ్లు.. అదే మాట మీద బెట్టింగ్ కు రెచ్చగొడితే మాత్రం మిన్నకుంటున్నారు.

అంతకంటె ట్విస్టు ఏంటంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుల9ు కూడా తెలుగుదేం ప్రభుత్వం వస్తుందనే బెట్టింగులు కడుతున్నారు. కాకపోతే.. తాము నేరుగా తెరమీదికి రాకుండా.. తమ బినామీలతో బెట్టింగులు కాయిస్తున్నారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టి పోగొట్టుకున్న డబ్బును తెలుగుదేశం గెలుపు మీద బెట్టింగ్ కాసి, కొంత మేరకైనా సంపాదించుకోవాలని వారు తాపత్రయ పడుతున్నట్టుగా తెలుస్తోంది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles