దసరా కాంబో మరోసారి..మరి ఇందులో హీరోయిన్‌ ఎవరంటే!

Wednesday, January 22, 2025

నేచురల్‌ స్టార్‌ నాని ప్రస్తుతంవివేక్‌ ఆత్రేయ కాంబోలో వస్తున్న తాజా చిత్రం సరిపోదా శనివారం. ఈసినిమా బిగ్గెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్ టైనర్‌ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ని డీవీవీ ఎంటర్‌ టైనర్స్‌ బ్యానర్‌ పై గ్రాండ్‌ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో గ్యాంగ్‌ లీడర్‌ ముద్దుగుమ్మ ప్రియాంక మోహన్‌ ని హీరోయిన్‌ గా ఎంపిక చేసినట్లు సమాచారం.

ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌ సినిమా పై మంచి హైప్‌ ని క్రియేట్‌ చేశాయి. ఈ సినిమాని ఆగస్టు 29న విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్‌ చేస్తుంది. ఈ మూవీ తరువాత నాని స్టార్‌ డైరెక్టర్‌ సుజీత్‌ తో సినిమా చేసేందుకు రెడీ అయ్యారు.

కానీ బడ్జెట్ ఇష్యూ వల్ల ఆ సినిమా హోల్డ్‌ లో పడింది. ఇదిలా ఉంటే నానికి బ్రేక్‌ ఇచ్చిన దసరా సినిమా డైరెక్టర్‌ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా నాని కెరీర్‌ లో 33 వ సినిమాగా తెరకెక్కుతుంది.

ఈ సినిమాలో కీర్లి సురేష్‌ పి హీరోయిన్‌ గా తీసుకుంటారా లేక మరో హీరోయిన్‌ ను తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో ఇంకో హీరోయిన్‌ పేరు కూడా వినిపిస్తుంది.ఆమె ఎవరో కాదు సాయిపల్లవి. వీరిలో ఎవరో ఒకరిని చిత్ర బృందం ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles