ఏఐతో డబ్బింగ్‌…!

Friday, December 5, 2025

హీరో సూర్య హీరోగా రాబోతున్న ప్రెస్టిజియస్‌ మూవీ ‘కంగువా’.  ఈ సినిమా ని డైరెక్టర్‌ శివ రూపొందిస్తున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఫాంటసీ యాక్షన్‌ ఫిల్మ్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా నవంబర్‌ 14న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌ గా విడుదల అవ్వనుంది. అయితే, తాజాగా ఈ చిత్రం గురించి నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పారు.

‘కంగువా’లో ఏఐని ఉపయోగించినట్లు ఆయన తెలియజేశారు. నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ తన పోస్ట్ లో రాసుకొస్తూ.. ‘కంగువా’ సినిమాను ఏకంగా 8 భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నాం. అయితే, తమిళ వెర్షన్‌కు సూర్య డబ్బింగ్‌ చెప్పగా.. మిగతా భాషల్లో ఏఐ సాయంతో డబ్బింగ్‌ పనులు పూర్తిచేశాం. డబ్బింగ్‌ పనుల కోసం కోలీవుడ్‌లో ఏఐని ఉపయోగించడం ఇదే మొదటిసారి.

తాజాగా విడుదలైన ‘వేట్టయన్‌’లో అమితాబ్‌ బచ్చన్‌ వాయిస్‌లో మార్పుల కోసం ఏఐను ఉపయోగించారు. ఇప్పుడు పూర్తిగా డబ్బింగ్‌ కోసం మేం దీన్ని ఉపయోగిస్తున్నాం. ఇది విజయవంతమవుతుందని అనుకుంటున్నాం’ అని నిర్మాత జ్ఞానవేల్‌ తన పోస్ట్ లో ఈ క్లారిటీ ఇచ్చారు. అన్నట్టు కంగువా రూ.1000 కోట్ల కలెక్షన్స్‌ చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు నిర్మాత తెలియజేశారు.

ఇప్పటికే, పార్ట్ 2, పార్ట్‌ 3 కథలు సిద్ధంగా ఉన్నాయట. పార్ట్‌ 1 ఇచ్చే విజయం ఆధారంగా వాటిని తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో దిశా పఠానీ కథానాయికగా చేస్తున్న సంగతి తెలిసిందే. బాబీ డియోల్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles