నెక్ట్స్‌ లెవల్లో టైటిల్‌ సాంగ్‌ షూటింగ్‌ జరుపుకుంటున్న డబుల్ ఇస్మార్ట్‌!

Sunday, December 22, 2024

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ , ఎనర్జిటిక్ స్టార్‌ హీరో రామ్‌ కాంబోలో వచ్చిన సినిమా ఇస్మార్ట్‌ శంకర్‌. ఈ సినిమాకి సీక్వెల్‌ గా తెరకెక్కుతున్న చిత్రం డబుల్‌ ఇస్మార్ట్‌. ప్రస్తుతం చిత్ర బృందం అంతా కూడా ఈ సినిమా షూటింగ్‌ లో బిజీగా ఉన్నారు. కొంతకాలం క్రితం ముంబైలో ప్రధాన పాత్రలకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

చిత్ర బృందం ఇటీవల విడుదల చేసిన టీజర్ సూపర్‌ రెస్పాన్స్ అందుకుంది. మొదట ఈ సినిమాని మార్చ్ 8 న విడుదల చేయాలనీ అనుకున్నారు. కానీ షూటింగ్ ఆలస్యం అవ్వడం వల్ల వాయిదా వేశారు.  తాజాగా  పుష్ప 2 రిలీజ్ డిసెంబర్ కి పోస్ట్ పోన్ అవ్వడంతో.. ఆ సినిమా విడుదల తేదీ అయిన ఆగస్టు 15 న రామ్ డబుల్ ఇస్మార్ట్ గా థియేటర్లో సందడి చేయనున్నాడు.

ఈ క్రమంలోనే రిలీజ్‌‌‌‌‌‌‌‌కు 50 రోజులు ఉండడంతో కౌంట్‌‌‌‌‌‌‌‌ డౌన్‌‌‌‌‌‌‌‌ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేయడంతో పాటు షూటింగ్ అప్‌‌‌‌‌‌‌‌డేట్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో టైటిల్ సాంగ్‌‌‌‌‌‌‌‌ను షూట్ చేస్తున్నారు. ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నాడు. సంగీత దర్శకుడు మణిశర్మ కంపోజ్ చేసిన ఎనర్జిటిక్ మాస్ సాంగ్ చార్ట్‌‌‌‌‌‌‌‌ బస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవబోతోందని, అలాగే రామ్ సిగ్నేచర్ డ్యాన్స్ మూమెంట్స్‌‌‌‌‌‌‌‌తో విజువల్‌‌‌‌‌‌‌‌ ట్రీట్‌‌‌‌‌‌‌‌గా ఈ పాట ఉండబోతోందని మూవీ మేకర్స్ అంటున్నారు.

పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్, చార్మి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. కావ్య థాపర్ హీరోయిన్ గా చేస్తుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles