పాచిరికార్డులు వేయొద్దు జగన్.. వినడం నేర్చుకోండి!

Monday, December 8, 2025

ఒంటెత్తు పోకడలతో చెలరేగినందుకు ఫలితంగా.. రాష్ట్ర ప్రజలు అత్యంత దారుణంగా తిరస్కరించి.. అహంకారంతో విర్రవీగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కేవలం 11 సీట్లకు పరిమితం చేసి ఇంటికే పరిమితం చేసి దాదాదాపుగా ఏడాది గడుస్తోంది. కనీసం ఇప్పటికైనా ఆయనలో పార్టీని కాపాడుకోవాలనే ధ్యాస పుట్టినట్టుగా పార్టీ వర్గాలు ఒకింత సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే.. సాధారణంగా పార్టీకి వెన్నెముకలాగా, కీలకంగా ఉండే పొలిటికల్ అడ్వయిజరీ కమిటీని ఇటీవలే జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో పునర్ వ్యవస్థీకరించారు. ఈ కమిటీ తొలి సమావేశాన్ని 22వ తేదీ మంగళవారం నిర్వహించబోతున్నారు. అయితే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుగా తన అహంకారాన్ని తగ్గించుకుని.. తన తరహా మార్చుకుంటే తప్ప.. ఇలాంటి సమావేశాలు ఎన్ని జరిగినప్పటికీ పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చునని  పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.

సాధారణంగా క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు.. అందరినుంచి సలహాలు తీసుకుని.. వాటిని బేరీజు వేసుకుని.. సరైన దృక్పథంతో రాజకీయ విధానాలను నిర్ణయించుకోవడానికి ఇలాంటి పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ ఎంతో ఉపయోగపడుతుంది. అన్ని పార్టీల్లో ఇలాగే జరుగుతుంది. కానీ జగన్ తీరు మరోలా ఉంటుంది. జగన్ పేపర్ మీద కమిటీలు ఏర్పాటు చేస్తారే తప్ప.. వాస్తవంలో ఆయన ఎవ్వరి సలహానూ వినిపించుకునే స్థితిలో ఉండరు అని పార్టీ నాయకులే అంటుంటారు.

ఆయన హవా నడిచిన రోజుల్లో ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది గానీ.. ఇప్పుడు దారుణమైన స్థితిలో ప్రతిపక్షంలో కూర్చుని ఉన్న సమయంలో జగన్ తన తీరు మార్చుకోవాలని పలువురు అంటున్నారు.
జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఏ సమావేశం నిర్వహించినా సరే.. దాన్ని ఒక ప్రెస్ మీటలాగా పెడుతుంటారు. ప్రెస్ మీట్లలో ఆయన తాను చెప్పదలచుకున్నది చెప్పేసి, విలేకర్ల ప్రశ్నలకు అవకాశం కూడా ఇవ్వకుండా అక్కడినుంచి వెళ్లిపోతుంటారు. ఆయన పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించినా అంతే. పార్టీ నాయకుల అభిప్రాయాలకు జగన్ వద్ద విలువ ఉండదు. ఇప్పుడు ఆయన ఏకంగా 34 మందితో పీఏసీ ఏర్పాటుచేశారు. అందరూ సీనియర్లే. కానీ వాళ్ల మాటకు విలువ ఇస్తే తప్ప దాని వల్ల ప్రయోజనం ఉండదనేది పలువురి అభిప్రాయం. జగన్ ఏ పార్టీ నాయకుల సమావేశం నిర్వహించినా.. ఏడాది కిందట ఎన్నికల ప్రచారానికి బట్టీ పెట్టిన ప్రసంగాన్నే వల్లిస్తుంటారని.. చంద్రబాబు కు విశ్వసనీయత లేదు, ఇప్పుడైనా సరే.. ప్రజల వద్దకు తలెత్తుకుని వెళ్లగలం అనే పడికట్టు మాటలతో ఆత్మవంచన చేసుకుంటూ గడుపుతుంటారని.. ప్రజలు తమను ఛీత్కరించి ఓడించారనే వాస్తవాన్ని ఆయన ఇంకా గుర్తించడం లేదని పార్టీ నాయకుల అభిప్రాయంగా ఉంది. పార్టీని కాపాడుకోవాలంటే.. జగన్ తాను మాట్లాడడం మానేసి.. మొత్తం 34 మంది పీఏసీ సభ్యుల అభిప్రాయాలను ముందు తెలుసుకోవాలని, పాయింట్లు నోట్ చేసుకోవాలని.. వాటిపై చర్చ పెట్టాలని, అంతిమంగా విధానాలను రూపొందించుకోవాలని.. అలా కాకుండా.. తన ఉపన్యాసానికి శ్రోతలు కావాలన్నట్టుగా 34 మందిని పిలిచి మాట్లాడేసి పంపితే.. ప్రయోజనం ఉండదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles