తణుకు అన్న క్యాంటీన్ పై వైఎస్ఆర్సీపీ దళాలు ఒక విష ప్రచారాన్ని ప్రారంభించాయి. ఒక తప్పుడు వీడియోను వారే సృష్టించి.. దాని ద్వారా అన్న క్యాంటీన్ల శుభ్రత మీద ప్రజల్లో అనుమానాలు పుట్టే ప్రచారం చేశారు. ఇలాంటి దుర్మార్గాన్ని మంత్రి నారా లోకేష్ ఖండించారు కూడా. అయితే.. ప్రభుత్వం చేపడుతున్న ఒక మంచి పని గురించి హేయమైన రీతిలో తప్పుడు ప్రచారం చేస్తున్న ఇలాంటి సోషల్ మీడియా విష పురుగులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకుడదని.. ఏరి పారేయాలని ప్రజలు కోరుతున్నారు.
పోకిరి సినిమాలో నాజర్ చెప్పే డైలాగు ఒకటి ఉంటుంది. నాజర్ కొడుకు అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ అని విలన్లకు తెలిసిపోయిన తరువాత.. నాజర్ ను నిర్బంధించి.. హింసించి.. కొడుకు గురించి చెప్పమని అడుగుతారు.
నా కొడుకు సేద్యం చేస్తున్నాడు అని చెబుతాడు నాజర్! పైరులో కలుపు మొక్కలను ఏరి పారేసినట్టుగా.. సమాజంలో దుర్మార్గులను ఏరి పారేస్తున్నాడని గర్వంగా చెబుతాడు.
ఆ తరహాలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం.. ప్రభుత్వ మంచి పనులు గురించి ఇలాంటి ఫాబ్రికేటెడ్ విషపూరిత తప్పుడు ప్రచారం చేసే దుర్మార్గులను ఏరి పారేయాలని ప్రజలు కోరుతున్నారు
జగన్ హయాంలో ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు మీద ప్రజలు తమ భిన్నాభిప్రాయాలు తెలియజేస్తే చాలు.. వారి మీద కేసులు పెట్టి వేధించారు. జైళ్లలో పెట్టారు. అలాంటిది ఇపుడు ఇంత దుర్మార్గం చేసేవారిని విడిచిపెడితే.. మరింతగా రెచ్చిపోతారని ప్రజలు అంటున్నారు. ఇవాల్టి టెక్నాలజీని బట్టి అసలు వీడియో తీసిన వ్యక్తులు, తొలుత సోషల్ మీడియాలో పెట్టిన వారిని గుర్తించడం చాలా సులువు అని, తక్షణం వారిని పట్టుకుని విచారించాలని ప్రజలు కోరుతున్నారు.