నన్నిక విసిగించోద్దు డార్లింగ్‌!

Monday, December 23, 2024

చేతినిండా సినిమాలతో ముందుకు దూసుకుపోతున్నాడు యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌. ఈ మధ్యనే హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా పూజా కార్యక్రమం కూడా మొదలు పెట్టాడు. మరోపక్క సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌ లో కూడా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాలు రెండు వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలున్నాయి. ఇక ఆ సినిమాలు సెట్స్ మీదకు వెళ్లే లోపే మారుతీ దర్శకత్వంలో చేస్తున్న రాజా సాబ్ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని గట్టి పట్టుదల మీదున్నాడు.

ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ఆ రెండు సినిమాల షూటింగ్స్ మొదలయ్యే లోపే పూర్తి చేసేయాలనే ఆలోచనలో ఉన్నట్లు  తెలుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రభాస్ మారుతికి పెద్ద టార్గెట్ ఇచ్చాడని అక్టోబర్ లోపు తన పోర్షన్ సంబంధించిన షూటింగ్ అంతా పూర్తి చేయాలని కోరినట్లుగా సమాచారం.

.ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన టాకీ మాత్రమే షూట్ చేస్తూ వస్తున్నారు. అయితే ప్రభాస్ కోరిన మేరకు సినిమా సాంగ్స్ కూడా మొదలుపెట్టే అవకాశం కనిపిస్తుంది. సినిమా ప్రస్తుతానికి 70% షూటింగ్ పూర్తి చేసుకోగా ప్రభాస్ జాయిన్ అయితే మిగతా 30% కూడా పూర్తవుతుందని అంటున్నారు. ప్రభాస్ మరే సినిమాకి డేట్స్ ఇవ్వకుండా ఈ సినిమాకి బల్క్ డేట్స్ ఇచ్చాడని వీలైనంత త్వరగా సినిమా పూర్తి చేయడానికి చిత్ర బృందం ప్రయత్నం చేస్తుందని టాక్‌ వినిపిస్తుంది.

ఏమైనా ఉంటే అక్టోబర్ లోపే చేసుకో ఆ తరువాత నన్నిక విసిగించద్దు బాబోయ్ అంటున్నాడట. ఇక ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్తో పాటు మరో ముగ్గురు ముద్దుగుమ్మలు కూడా హీరోయిన్లుగా చేస్తున్నారు. ఏప్రిల్ 2025లో సినిమాని విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందు సంక్రాంతి అనుకున్నారు కానీ అప్పటికి సినిమా విడుదల కష్టంగానే ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles