ప్రజలను కలవాలంటే జగన్ కు అసహ్యమా?

Thursday, December 26, 2024

ప్రజలను, పేదవారిని, చివరకు పార్టీలోని సామాన్య కార్యకర్తలను కలవడం అంటే ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి కి అసహ్యంగా ఉంటుందా? ఏదో పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు అలాంటి కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారే గానీ, కలవాల్సి వచ్చేసరికి వాయిదా చేస్తున్నది ఇందుకేనా? అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. ఈ నెల 15 వ తేదీ నుంచి తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించాలని తొలుత నిర్ణయించినప్పటికీ.. దానిని రద్దు చేసుకుని మరీ ఆయన బెంగళూరు ప్యాలెస్ లో విశ్రాంతి తీసుకోవడానికి వారం రోజులు వెళుతుండడం ఇందువల్లనే అని అంతా అనుకుంటున్నారు.

జగన్మోహన్ రెడ్డి ఏదో ఎన్నికల అవసరాల నిమిత్తం ప్రజల్లో తిరుగుతారే తప్ప వాస్తవంగా ఆయనకు ప్రజలపై ఎలాంటి అభిమానం లేదని అనుకుంటున్నారు. ఎందుకంటే ఎన్నికలకు ముందు మాత్రం సామాన్యులను, పేదలను వాటేసుకుని, తలలు నిమిరి ముద్దులు పెట్టే జగన్, ఎన్నికల తర్వాత వారిని పట్టించుకోరు. సిఎం గా ఉండగా ఆయన ప్రజలను కలిసిన సందర్భాలే లేవు. పేద ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించడానికి స్పందన కార్యక్రమాన్ని ప్రకటించారు గానీ, అయిదేళ్ల పాలన కాలంలో ఎన్నడూ నిర్వహించలేదు. వాయిదాలు వేస్తూనే గడిపేశారు. జగన్ ఎప్పుడు ఊర్లలో పర్యటించినా ప్రజలను కలవరు. పరదాల మధ్యనే తిరుగుతారు. ఆయనను జనం చూడాలంటే సభకు రావాల్సిందే. అలా ప్రజలను వెలివేసి జగన్ బ్రతికారు.

తీరా ఓడిపోయిన తరువాత బెంగళూరు ప్యాలెస్ వెళ్లిపోయిన జగన్, ఈనెల 15 నుంచి ప్రజాదర్బార్ నిర్వహిస్తారని ప్రకటించారు. జిల్లా పార్టీలకు సమాచారం కూడా పంపారు. తీరా జగన్ ప్రజలను కలిసే కార్యక్రమం రద్దు చేసుకుని, మళ్లీ బెంగుళూరు పారిపోతున్నారు. ఇదంతా చూస్తే జనాన్ని కలవడం జగన్మోహన్ రెడ్డికి అసహ్యం అని అంతా అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles