మంచుమనోజ్‌ కుమార్తెకి ఏం పేరు పెట్టాడో తెలుసా!

Sunday, December 22, 2024

మంచు మనోజ్ భార్య మౌనిక ఈ ఏడాది ఏప్రిల్‌లో పండంటి పాప‌కి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. మంచు వారింట్లో మహాలక్ష్మి పుట్టింది అని మనోజ్, మంచులక్ష్మీ ఈ విషయాన్ని స్వయంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలిపారు. అయితే, ఇటీవల ఆ చిన్నారికి బారసాల నిర్వహించి పేరు పెట్టారు. తాజాగా మంచు మనోజ్ స్వయంగా ఆ పాప పేరును తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులకు తెలియజేశాడు.

మంచు మనోజ్, మౌనిక దంపతుల కూతురుకి ‘దేవసేన శోభ ఎంఎం’ అనే పేరు పెట్టినట్టు అధికారికంగా వెల్లడించారు. అయితే దేవసేన శోభ అనే పేరుని సుబ్రహ్మణ్య స్వామి భార్య దేవసేన పేరు నుంచి తీసుకున్నామని, అలాగే శోభ అని దివంగత మా అత్తగారు శోభ నాగిరెడ్డి నుంచి తీసుకున్నామని మనోజ్ వివరించారు.

ఆ పేరుతో పాటు బారసాల వేడుక‌ ఫొటోల‌ను కూడా మనోజ్ పంచుకున్నాడు. ఇక ఆ చిన్నారి ఉయ్యాలలో ఉండగా మంచు మనోజ్, మౌనికతో పాటు మోహన్ బాబు ఫ్యామిలీ అంతా కనిపిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. దీంతో అభిమానులు, నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles