శంకర్‌ దెబ్బకు సినిమాలు తీయడం మానేసిన నిర్మాత ఎవరో తెలుసా?

Sunday, December 22, 2024

శంకర్ షణ్ముగం 90 దశకాల్లో ఈ డైరెక్టర్‌ పేరు ఓ సంచలనం, శంకర్ తో సినిమా అంటే సూపర్ హిట్ గ్యారంటి, నిర్మాతలకు లాభాలే లాభాలు అనే టాక్ కూడా ఉండేది. నిర్మాతలు, హీరోలు శంకర్ తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపేవారు. అది అప్పట్లో శంకర్ రేంజ్, జెంటిల్ మెన్, జీన్స్, ఒకే ఒక్కడు, భారతీయుడు, అపరిచితుడు, బాయ్స్,శివాజీ అబ్బో ఒకటేమిటి ఇలా  ప్రతిసినిమా కూడా వేటికవే బ్లాక్ బస్టర్. రజనితో తీసిన రోబో అయితే ఇండియన్ స్క్రీన్ పై ఒక సంచలనంకానీ అదంతా గతం.

రోబో తర్వాత శంకర్ ప్రభ కనుమరుగైందనే చెప్పుకొవచ్చు. స్నేహితుడుతో మొదలైన శంకర్ డౌన్ ఫాల్ భారతీయుడు -2 వరకు పడుతూనే ఉంది. ఓడలు బళ్ళు,బళ్ళు ఓడలు అవుతాయి అనేదానికి శంకర్ నే చక్కటి ఉదాహరణగా నిలిచాడు. ఇప్పుడు శంకర్ తో సినిమా అంటే నిర్మాతలు కుదేలైపోవాల్సిదే. శంకర్ దర్శకత్వంలో శివాజీ సినిమా చేసిన AVM స్టూడియోస్ ఆ సినిమా నష్టాల దెబ్బకు సినిమాలు తీయడం మానేసి, సీరియల్స్, షాట్ ఫిల్మ్స్ చేసుకుంటుంది.

ఇక విక్రమ్, శంకర్ ల ‘ఐ’ నిర్మించిన ఆస్కార్ రవిచంద్రన్ ఆ ఒక్క సినిమా ఫ్లాప్ తో పీకల్లోతూ అప్పుల్లో కూరుకుపోయారు. విజయ్ తో చేసిన స్నేహితుడు మూవీ దాటికి జెమినీ ఫిల్మ్స్ జెండా ఎత్తేసారు. ఇక శంకర్ తో రోబో 2.O, భారతీయుడు -2 సినిమాలు చేసిన లైకా ప్రొడక్షన్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పానవసరం లేదు. శంకర్ తో సినిమాలు చేసి అటు ఇటుగా 500 కోట్ల రూపాయలు మేర నష్టపోయారు లైకా వారు.

అనవసరపు ఆర్భాటాలు, కథ, కథనం లోపించడం, భారీ సెట్లుతో భారీగా ఖర్చు చేయడం విడుదల అయ్యాక ఫ్లాప్ అవడంతో నిర్మాతలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం శంకర్ చేస్తున్న గేమ్ ఛేంజెర్ పరిస్థితో ఏంటో రాబోయే రెండు నెలల్లో తెలియనుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles