గొర్రె పురాణం వింటావా సామి…!

Thursday, January 23, 2025

మంచి కాన్సెప్ట్ కథలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతున్న హీరో సుహాస్. కలర్ ఫొటో సినిమాతో హీరో గా తన ప్రస్థానం మొదలు పెట్టిన ఈ నటుడు…. వరుసగా రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ప్రసన్న వధానం లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ కథలతో తెలుగు ప్రేక్షకులను అలరించి బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటుకున్నాడు. ఇప్పుడు మరో కొత్త కాన్సెప్ట్ చిత్రం తో సెప్టెంబర్ 20 న అభిమానుల ముందుకు వస్తున్నాడు.

ఫోకల్ వెంచర్స్ పతాకం పై సుహాస్ హీరో గా బాబీ దర్శకత్వం లో ప్రవీణ్ రెడ్డి నిర్మిస్తున్న వినూత్న కథ చిత్రం “గొర్రె పురాణం”. ఈ సినిమా నుంచి ఇటీవలే విడుదల అయిన టీజర్ కి విశేష స్పందన లభించింది. ఇప్పుడు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 20 న విడుదల కానుంది. ఈ సినిమా ఒక గొర్రె కథ, ఓ చిన్న గ్రామంలో హిందూ- ముస్లింల మధ్య చిచ్చుపెట్టిన ఓ గొర్రె కథ. కథ చాలా కొత్తగా ఉంటుంది. మంచి కథ కథనం  తో సోషల్ మెసేజ్ ఉన్న వినూత్న కథగా ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఈ సినిమాలో సుహాస్ చాలా బాగా నటించాడు. పవన్ సి హెచ్ స్వరపరిచిన పాటలు ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాన్నాయి. ‘భలే భలే’ ,  ఓ రారే రారే లిరికల్ పాటలు విడుదలై  గొర్రె పురాణం చిత్రం మీద అంచనాలు పెంచాయి. ఈ చిత్రం లో గొర్రె కి దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ వాయిస్ ఓవర్ అందించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles