‘సూపర్ హిట్’ అర్తం జగన్ దళాలకు తెలుసా?

Thursday, December 4, 2025

ఒక సినిమా సూపర్ హిట్.. అనే టాక్ ఎప్పుడు వస్తుంది? ఒక సినిమా విడుదల అయి.. వంద సెంటర్లలో వంద రోజులు ఆడిన తర్వాత మాత్రమే వస్తుందా? లేదా, యాభై సెంటర్లలో సిల్వర్ జూబిలీ ఆడిన తర్వాత మాత్రమే సూపర్ హిట్ అయినట్టుగా పేర్కొనాలా? అప్పటిదాకా ‘సూపర్ హిట్’ అనే పదం వాడడానికే వీల్లేదా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జగన్ దళాల అత్యుత్సాహం అలాగే భావిస్తున్నది. వారి మాటలే సంకుచితంగా కనిపిస్తున్నాయి. చంద్రబాబునాయుడు ‘సూపర్ సిక్స్ సూపర్ హిట్’ అంటూ అనంతపురం లో భారీ బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో.. సూపర్ హిట్ అనే పదం కరక్టేనా కాదా అనే చర్చ నడుస్తోంది. సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ కావడం అనే మాట అక్షరాలా నిజమే అని.. ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే-
సూపర్ హిట్ అనేది సినిమా పరిభాషకు సంబంధించిన పదం. ఒక సినిమా విడుదల అవుతుంది. ఆ సినిమాకు ప్రజల్లో ఆదరణ ఎలా ఉంది? అనే సంగతి ఒకటి రెండు రోజుల పబ్లిక్ టాక్ తో అర్థమైపోతుంది. ప్రజల స్పందన అర్థమైతే చాలు.. ఆ సినిమా సూపర్ హిట్ నా కాదా? అనేది చెప్పేయవచ్చు. అలాగే ఆ సినిమా వందరోజులు పూర్తి చేసే దాకా నిరీక్షించాల్సిన అవసరం లేదు. పూర్తి అయితే.. అది ఒక ప్రత్యేకమైన వేడుక అంతే!

అచ్చంగా ఇప్పుడు చంద్బరాబునాయుడు రాష్ట్రప్రజలకు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల విషయంలో అదే జరుగుతోంది. చంద్రబాబునాయుడు సూపర్ సిక్స్ పేరుతో ఆరు హామీలను ప్రకటించారు. ఎన్నికలకు ఏడాది ముందే ప్రకటించి.. తాను అధికారంలోకి వస్తే రాష్ట్రప్రజలకు ఏం చేయదలచుకుంటున్నానో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లారు. ప్రజలు వాటిని నమ్మారు. ఏనాడైతే ప్రజలు తిరుగులేని మెజారిటీతో ఆశీర్వదించి.. కూటమి పార్టీలకు 164 సీట్లు కట్టబెట్టి, అధికారంలో కూర్చోబెట్టారో.. ఆనాడే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయినట్టు లెక్క!

అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ లోని ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ.. ఇప్పటికే నాలుగు హామీలను అమల్లో పెట్టిన చంద్రబాబు సర్కారుకు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పుకోడానికి పూర్తి హక్కులు ఉన్నాయనేది ప్రజల వాదన. ఇంకా కేవలం రొండు హామీలు మాత్రం మిగిలి ఉన్నాయి. అయితే ఈ ప్రభుత్వానికి ఇంకా నాలుగేళ్ల పదవీకాలం ఉన్నదనే సంగతిని కూడా మరచిపోకూడదు.
అయిదేళ్ల పదవీకాలానికి ఇచ్చిన ఆరు హామీలలో నాలుగింటిని ఆల్రెడీ పూర్తి చేయడం అంటే.. చాలా గొప్ప విషయం అనే నమ్మకం ప్రజల్లో ఉంది. ప్రజల్లో చంద్రబాబు పట్ల నమ్మకం ఉన్నంత కాలం సూపర్ హిట్ అయినట్టే కదా.. అనేది పలువురి వాదన. అయితే, కూటమి పాలన పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకపోతున్న జగన్ దళాలు.. ప్రధానంగా సూపర్ సిక్స్ హామీల విషయంలో ప్రజలు సంతృప్తి చెందితే.. తమకు రాజకీయ సమాధి తప్పదని ఆందోళన చెందుతున్నాయి. అందుకే, ఆ హామీలు అమలవుతున్న తీరు కనుల ఎదుట కనిపిస్తున్నప్పటికీ.. అవి ఫెయిలయ్యాయంటూ నానా యాగీ చేస్తున్నారు. ఒక జిల్లాకు కల్పిస్తామని చెప్పిన ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏకంగా రాష్ట్రం మొత్తానికి అమలు చేస్తున్నప్పటికీ కూడా.. దాని మీద కూడా నిందలు వేస్తూ.. ఉచిత ప్రయాణం పథకం ఫెయిల్ అంటూ వారు ప్రజల్లో చులకన అవుతున్నారు. సూపర్ హిట్ అనే పదానికి అర్థం తెలియని అజ్ఞానమే వైసీపీ నేతలతో ఇలా మాట్లాడిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles