ఫార్చూన్, ఫోర్బ్స్ అంటే సూట్‌కేస్ కంపెనీలు అనుకున్నారా?

Friday, December 5, 2025

చంద్రబాబునాయుడు ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన పాలసీ ‘లిఫ్ట్’ మీద ఇప్పుడు జగన్ దళాలు విషం కక్కుతున్నాయి. ఎంతో పారదర్శకంగా, కుమ్మక్కు అయ్యారనే ఆరోపణలకు కూడా అవకాశం లేకుండా.. చాలా జాగ్రత్తగా రూపొందించిన పాలసీ ద్వారా.. అంతర్జాతీయంగా పేరుమోసిన, అగ్రశ్రేణి ఐటీ కంపెనీలను ఏపీలో పెట్టుబడులకు, తమ సంస్థల శాఖలను ప్రారంభించేందుకు ఆకర్షించాలని చంద్రబాబు సర్కారు అవిరళ కృషి చేస్తోంది. ఇందుకోసం కొన్ని అర్హత ప్రమాణాలను నిర్ణయించారు. అంతర్జాతీయ స్థాయి ప్రముఖ సంస్థలను మాత్రమే వడపోత ద్వారా అనుమతించడానికి అర్హతలను నిర్ణయిస్తే.. జగన్మోహనరెడ్డి దళాలు.. తప్పుడు విమర్శలు చేస్తున్నాయి. చంద్రబాబునాయుడు తన బినామీలకు కట్టబెట్టడం కోసమే ఈ ఎంపిక ప్రమాణాలన్నట్టుగా అర్థంలేని విమర్శలతో చెలరేగుతున్నాయి.
ఫార్చూన్, ఫోర్బ్స్ ర్యాంకింగ్ లో గత మూడేళ్లలో 500 జాబితాలో లిస్టింగ్ అయిన  కంపెనీలు అయిఉండాలనేది మొదటి అర్హత. అలాగే ఒక బిలియన్ డాలర్ల ఆదాయం కలిగి ఉండాలనేది మరో అర్హత. వారు మాత్రమే లిఫ్ట్ పాలసీ కింద ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి, భూములు పొందడానికి అర్హులు. వారు పొందే భూముల్లో ఎకరానికి 500 వంతున ఉద్యోగాలు కల్పించాల్సి ఉంటుందనేది ప్రధాన నిబంధన.

ఇన్ని రకాల నిబంధనలతో అంతర్జాతీయ సంస్థలను కూడా ఫిల్టర్ చేస్తూ ఉండగా.. జగన్ దళాలు.. కుట్రపూరితంగా, ‘బినామీలకు కట్టబెట్టడం కోసమే’ అనే వ్యాఖ్య చేయడం దారుణం అని పలువురు విమర్శిస్తున్నారు. ఫార్చూన్ ఫోర్బ్స్ 500 జాబితాలో ఉండే కంపెనీలు అంటే.. జగన్మోహన్ రెడ్డి తాను హవాలా డబ్బు తరలింపులకోసం, మద్యం అక్రమార్జనలను వైట్ మనీగా మార్చుకోవడం కోసం, క్విడ్ ప్రోకో ఒప్పందాలు కుదుర్చుకోవడం కోసం ఏర్పాటుచేసే సూట్ కేసు కంపెనీలు అనుకుంటున్నారా? అనే వాదన ప్రజల నుంచి వస్తోంది.

జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం మొత్తం కుట్రలతో నిండినటువంటిదే. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే పలు కంపెనీలకు అడ్డదారుల్లో మేలు చేయడం ద్వారా వారినుంచి వందల వేల కోట్ల ముడుపులు తన సంస్థల్లోకి పెట్టుబడులుగా పొందడం, ఆ పెట్టుబడులు పెట్టడానికి దేశంలో ఎక్కడెక్కడి చిరునామాలతోనో సూట్ కేసు కంపెనీలు ఏర్పాటు చేయడం అంతిమంగా తన సొంత ఖజానాను వేల కోట్లరూపాయలతోనింపుకోవడం జగన్ కు అలవాటు. తండ్రి సీఎంగా ఉన్నప్పుడూ అదే చేశారు. తాను సీఎం అయిన తర్వాత కూడా లిక్కర్ స్కామ్ సొమ్ములను అదే రూపాల్లో తరలించారు. అందుకే చంద్రబాబునాయుడు అంతర్జాతీయ ప్రముఖ కంపెనీలను తేవడానికి ప్రయత్నిస్తోంటే.. అవన్నీ చంద్రబాబుకు బినామీ కంపెనీలే అని చెప్పడానికి ఈ దళాలు ప్రయత్నిస్తున్నాయి. కానీ ప్రజలు మాత్రం వైసీపీ దళాల దుష్ప్రచారం పట్ల అప్రమత్తంగానే ఉంటూ ఎప్పటికప్పుడు వారి దుర్బుద్ధులపై జాలి చూపిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles