లిక్కర్ స్కాంలో ఈ కీలకాంశం గుర్తించారా?

Friday, December 5, 2025

లిక్కర్ కుంభకోణంలో ఇప్పటికి 33 మంది నిందితుల పేర్లు నమోదు అయ్యాయి. ఏడుగురిని అరెస్టు చేసి రిమాండులో ఉంచి పోలీసులు విచారిస్తున్నారు. ఇంకా పదుల సంఖ్యలో నిందితులు లెక్క తేలే అవకాశం ఉంది. బిగ్ బాస్ గా, ముడుపుల యొక్క అంతిమప్రయోజనం పొందిన వ్యక్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా నిందితుల జాబితాలోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇన్ని జరుగుతున్నా సరే.. ఈ దోపిడీకి మూల కారణం అయిన సరికొత్త లిక్కర్ పాలసీ రూపు దిద్దుకునే నాటికి అబ్కారీ శాఖ మంత్రిగా వ్యవహరించిన వారి పేరు కూడా ఇప్పటిదాకా బయటకు రాలేదు. ఈ పాలసీ రూపొందినప్పుడు గానీ, బెవరేజెస్ కార్పొరేషన్ ఏర్పడినప్పుడు గానీ.. వసూళ్ల దందాలను నడిచినప్పుడు గానీ.. రాష్ట్రంలో ఎక్సయిజు మంత్రిగా ఎవరున్నారు? నిజానికి ఆ శాఖలో ఇంత పెద్ద కుంభకోణం జరిగినప్పుడు మంత్రికి కూడా ప్రమేయం ఉంటుంది కదా? కానీ.. మంత్రి పేరే బయటకు రావడం లేదు ఎందుకు? ఈ సంగతి ప్రజలు అసలు గమనించారా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో కొత్తగా నడుస్తోంది.

అప్పట్లో గంగాధర నెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కె.నారాయణ స్వామి ఎక్సయిజు శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన 2019 జూన్ 8 నుంచి, 2022 ఏప్రిల్ 7 వరకు ఆశాఖ మంత్రిగా కొనసాగారు. కానీ లిక్కర్ కుంభకోణంలో ఎక్కడ కూడా కనీసం సంబంధిత శాఖ మంత్రి పేరు- ప్రస్తావనకు కూడా రావడం లేదు. దీనిని బట్టి.. మంత్రులను జగన్మోహన్ రెడ్డి ఎంతగా డమ్మీలుగా మార్చేసి తన దుర్మార్గమైన పరిపాలన సాగించారో మనకు అర్థం అవుతుంది. ప్రత్యేకించి దళిత మంత్రులు ఆయన పరిపాలన కాలంలో ఎంత చులకనగా చూడబడ్డారో కూడా అర్థం అవుతుంది.

జగన్మోహన్ రెడ్డి పాలన కాలంలో మంత్రులందరూ కేవలం డమ్మీలుగానే ఉన్నారు తప్ప.. ఏ ఒక్కరికి కూడా తమ తమ శాఖల మీద కనీస నిర్ణయాధికారం లేనేలేదనే సంగతి అందరికీ తెలుసు. అన్ని శాఖలకు సంబంధించిన నిర్ణయాలను కూడా జగన్ పేషీలోని సకల  శాఖల మంత్రిగా ముద్రపడిన వ్యక్తులే తీసుకునే వారనే ప్రచారం కూడా ఉంది. గతంలో విద్యుత్తు శాఖ మంత్రిగా చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా అదానీ కంపెనీల నుంచి ముడుపులు తీసుకుని సెకితో కుదుర్చుకున్న ఒప్పందాల విషయంలో అంతా సీఎంఓ నడిపించిందే తప్ప.. తన అభిప్రాయం కూడా అడగలేదని ఆవేదన వెళ్లగక్కారు. ఇప్పుడు లిక్కర్ కుంభకోణం వివరాలు గమనిస్తే కూడా మనకు ఇదే అర్థమవుతుంది. ఈ కుంభకోణంలో  ఇప్పటికి 33 మంది నిందితులు తేలారు. ఇంకా పదుల సంఖ్యలో నిందితులు జతకావొచ్చుననే అనుమానాలు కూడా ఉన్నాయి. ఇంత జరుగుతున్నా.. కనీసం ఈ తప్పుడు మద్యం పాలసీ రూపొందిన నాటికి ఎక్సయిజు శాఖ మంత్రిగా ఉన్నదెవరు అనే ప్రస్తావన కూడా వినపడలేదు. దీనిని బట్టి అప్పటి మంత్రి నారాయణ స్వామి కి ఏమాత్రం సంబంధం లేకుండా.. జగన్ తన కోటరీ మనుషులతో మాత్రమే ఈ దందా మొత్తం నడిపించారని అందరూ భావిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles