ఆస్కార్‌ లైబ్రరీలో ‘రాయన్‌’.. ధనుష్‌ మూవీకి దక్కిన అరుదైన గౌరవం..!

Thursday, December 26, 2024

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం ‘రాయన్’. జులై 26న విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్‌ నే సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ధనుష్ నటన, సినిమాను తెరకెక్కించిన విధానం, స్క్రీన్ ప్లే అందరినీ విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అటు ప్రేక్షకులతో పాటు ఇటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.

ప్రస్తుతం థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సినిమాల్లో రాయన్‌ కూడా ఒకటి. ఇదిలా ఉంటే ఈ సినిమాకి  అరుదైన గౌరవం దక్కింది. ‘రాయన్’ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు ఈ సినిమా తాజాగా ఆస్కార్‌ లైబ్రరీలో చేరింది. ఆస్కార్‌ లైబ్రరీ అనేది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌కు చెందిన ఒక ప్రత్యేకమైన సంస్థ. ఈ లైబ్రరీలో చేరడం అంటే ఆ సినిమాకు ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.

గొప్ప స్క్రిప్ట్‌, స్క్రీన్‌ప్లేలకు మాత్రమే ఆస్కార్‌ అకాడమీ లెబ్రరీలో చోటు కల్పిస్తారు.గతేడాది వివేక్‌ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ది వ్యాక్సిన్‌ వార్‌’ స్క్రిప్ట్‌కు కూడా ఆస్కార్‌ లైబ్రరీలో శాశ్వత స్థానం కల్పించారు. రాయన్‌ కు ఆస్కార్‌ లైబ్రరీలో చోటు దక్కడం పై ధనుష్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆనందం  వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles