ఆ హీరో తో మాత్రమే మల్టీ స్టారర్‌ చేస్తానంటున్న ధనుష్‌!

Tuesday, January 21, 2025

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కథానాయకుడి నటిస్తూ, స్వయంగా దర్శకత్వం వహిస్తున్న సినిమా రాయన్. ధనుష్ కెరీర్ లో ఈ సినిమా 50వ మూవీగా రాయన్ సినిమా విడుదల కాబోతుంది. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. SJ సూర్య ప్రతి నాయకుడిగా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల్లో విశేష స్పందన దక్కిచుకుంది. కాగా రాయన్ తెలుగులో విడుదల కానున్న నేపథ్యంలో టాలీవుడ్ లో కూడా ప్రమోషన్స్ స్పీడ్ పెంచాడు హీరో ధనుష్.

ఇందులో భాగంగా హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ధనుష్‌ సందడి చేశాడు. ఆ సందర్భంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. తెలుగులో మీ అభిమాన నటుడు ఎవరు అని యాంకర్ ప్రశ్నించగా ధనుష్ మాట్లాడుతూ ” తెలుగులో నాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చాల ఇష్టం, మిగిలిన హీరోల ఫ్యాన్స్ నన్ను ద్వేషించొద్దు, నేను సినిమాను ప్రేమిస్తాను” అని చెప్పుకొచ్చారు.

మరొక ప్రశ్నగా యాంకర్ మల్టీ స్టారర్ చేయాలంటే సూపర్ స్టార్ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌, అల్లు అర్జున్ లలో ఎవరితో చేస్తారు అని యాంకర్ అడగగా, అందుకు సమాధానంగా జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చారు ధనుష్. ఈ సమాధానంతో ఆడిటోరియం మొత్తం jr,ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈలలతో హోరెత్తించారు. కాగా ఈ మూవీలో ప్రకాష్ రాజ్, సెల్వ రాఘవన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles