టిల్లు కోసం రంగంలోకి దేవర!

Monday, January 27, 2025

లేటెస్ట్‌ టాలీవుడ్ భారీ బ్లాక్ బస్టర్‌ చిత్రం టిల్లు స్క్వేర్‌… డీజే టిల్లుకి సీక్వెల్‌ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు తిరగరాస్తుంది. ఇందులో స్టార్ బాయ్‌ సిద్దూ జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్ గా చేయగా.. ఈ చిత్రాన్ని మల్లిక్ రామ్‌ తెరకెక్కించాడు. ఈ చిత్రం విడుదలై వారం రోజులు గడిచినప్పటికీ ఈ మాత్రం క్రేజ్‌ తగ్గలేదు.

ఈ క్రమంలోనే ఈ సినిమా హీరో సిద్దూ, ప్రొడ్యూసర్‌ నాగ వంశీలు మ్యాన్‌ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ ని కలిసిన విషయం తెలిసిందే. దీంతో తారక్‌ టిల్లు స్క్వేర్‌ సక్సెస్ మీట్‌ కి హాజరవుతాడనే విషయం పై క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా సక్సెస్‌ మీట్ కు ఎన్టీఆర్‌ స్పెషల్‌ గెస్ట్వ గా వస్తున్నట్లు సితార ఎంటర్‌ టైన్‌మెంట్‌ వారు ఇప్పుడు కన్ఫార్మ్‌ చేశారు.

ఈ వేడుకకు తారక్‌ హాజరు అయితే చాలా కాలం తరువాత యంగ్‌ టైగర్‌ ఓ స్టేజ్‌ మీద కనిపించనున్నాడని చెప్పాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles