పుష్ప 2 కి దేవర ఎఫెక్ట్‌!

Saturday, January 18, 2025

కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాలలో పుష్ప 2 కూడా ఒకటి. పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండవ భాగం మీద భారీ అంచనాలు క్రియేట్‌ అయ్యాయి. ఆ అంచనాలు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించేందుకు సుకుమార్ కూడా  చాలా కష్టపడుతున్నారు. ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుగుతోంది. వీలైనంత త్వరగా పూర్తి చేసి డిసెంబర్ ఐదో తేదీ రాత్రి కల్లా సినిమాని రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు రెడీ చేస్తున్నారు.

అయితే ఈ సినిమా బిజినెస్ విషయంలో ఇప్పుడు దేవర ఎఫెక్ట్ పడిందని తెలుస్తోంది. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవర సినిమాకి మౌత్ టాక్ అయితే  పాజిటివ్గా లేదు. అయినా సరే సినిమా కలెక్షన్లు మాత్రం ఓ రేంజ్ లో వచ్చాయి. దాదాపు 500 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. అలాగే కల్కి కూడా డివైడ్ టాక్ వచ్చినా సరే వందల కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఈ నేపథ్యంలోనే పుష్ప నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

అదేంటంటే ఇప్పటికే ఒక్కొక్క ఏరియా నుంచి ఇద్దరు ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లు సినిమా కొనుగోలు చేసేందుకు రెడీగా ఉన్నారు. చాలా ఏరియాలో ఇప్పటికే అమ్ముడైపోయాయి కూడా. అయినా సరే ఈ డిస్ట్రిబ్యూటర్లలో మార్పులు కూడా జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే ఎవరు ఎక్కువ ధర చెల్లిస్తే వాళ్లకు సినిమా హక్కులు అమ్మే అవకాశాలున్నాయి. కాబట్టి పుష్ప మార్కెట్ విషయంలో దేవర ఎఫెక్ట్ అయితే గట్టిగానే కనపడుతుంది.

మౌత్ టాక్ బాగున్న బాగోక పోయినా కలెక్షన్లు ఫుల్‌ గా వస్తున్నాయి . కాబట్టి చాలా ఆచితూచి ఎక్కువ రేటుకి మాత్రమే సినిమాని అమ్మాలని భావిస్తున్నారు. ఇంతకుముందు గేమ్ చేంజర్ పోటీగా వస్తుంది అనుకున్నారు కానీ ఆ సినిమా సంక్రాంతికి వెళ్లడంతో డిస్ట్రిబ్యూటర్లు భారీ రేట్లు పెట్టడానికి రెడీ అవుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles