బొమ్మల సినిమాకి అంత హైప్‌ ఎందుకంటే..!

Monday, December 8, 2025

సోషల్ మీడియాలో ఈ మధ్య ఒక ఆసక్తికరమైన డిబేట్ నడుస్తోంది. ముఖ్యంగా సినిమా ప్రియులు, కార్టూన్ మరియు యానిమేటెడ్ కంటెంట్ అభిమానుల మధ్య చర్చలు జోరుగా సాగుతున్నాయి. చిన్నప్పటి నుంచి చాలా మందికి కార్టూన్లు, 3డి యానిమేటెడ్ షోలు గురించి తెలిసే ఉంటుంది. కానీ వీటిలో కూడా వేర్వేరు స్టైల్స్ ఉంటాయి. జపాన్ లో పుట్టిన అనిమే అనే ప్రత్యేక యానిమేషన్ శైలి అందులో ముఖ్యమైనది. ఈ అనిమే కంటెంట్ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ సాధారణం కాదు.

ఇది గురించి సోషల్ మీడియాలో తగువులాంటి పరిస్థితి కనిపిస్తోంది. కొందరు దీన్ని సాధారణ బొమ్మల సినిమాలు అని తక్కువగా మాట్లాడుతుంటే, అభిమానులు మాత్రం ఈ అనిమే ఇచ్చే ఎమోషనల్ హైలు, పెద్ద సినిమాలు కూడా ఇవ్వలేవని చెబుతున్నారు. గ్రాఫిక్స్, కథ, ఎమోషన్స్ మిక్స్ అయిన ఈ కంటెంట్ కి ఉన్న ఫాలోయింగ్ ఊహించలేనంత పెద్దది.

ఈ చర్చకి కారణం ఇండియాలో ఇప్పుడు ఒక జపాన్ అనిమే సినిమా పెద్ద సెన్సేషన్ సృష్టించబోతోందనే వార్త. అదే డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ కాసిల్. దీనికి ముందే సిరీస్ ల రూపంలో కథ ముందుకు సాగింది. ఇప్పుడు మాత్రం ఇది మొదటి థియేట్రికల్ రిలీజ్ గా రాబోతోంది.

సెప్టెంబర్ 12న ఇండియా సహా ఇతర దక్షిణాసియా దేశాల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం మన దేశం నుంచే మొదటి రోజు దాదాపు 20 కోట్ల రూపాయల కలెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఈ జానర్ గురించి అందరికీ తెలియకపోయినా ఇంత పెద్ద స్థాయిలో ఓపెనింగ్స్ రావడం అంటే దీని క్రేజ్ ఎంతగా పెరిగిందో అర్థం అవుతుంది.

మన దగ్గర తెలుగు, జపనీస్, ఇంగ్లీష్ వెర్షన్లలో బుకింగ్స్ జోరుగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 8 గంటల నుంచి షోలు పెడుతుంటే, హిందీ వెర్షన్ కి అయితే తెల్లవారు జామున 5 గంటలకు కూడా స్పెషల్ షోలు ప్లాన్ చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles