కీలకమైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకంలో సీనియారిటీ, తమకోసం ఎన్నో ఇబ్బందులకు గురికావడం కాకుండా సొంత సామాజిక వర్గం, సొంత జిల్లాకే ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రాధాన్యత వచ్చినట్లు స్పష్టం అయింది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డిని నియమించడం ఒక విధంగా సీనియర్ ప్రభుత్వ అధికారులలో ఓ విధమైన అసమ్మతికి తీసే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. ఇప్పటికే కీలకమైన పదవులు అన్ని ఈ ప్రభుత్వంలో సీనియారిటీతో సంబంధం లేకుండా ఒకే సామజిక వర్గంకు దక్కుతున్నాయనే అసంతృప్తి ఉంది. ఇప్పుడు ప్రధాన కార్యదర్శి, డిజిపి ఒకే సామజిక వర్గంకు చెందినవారు కావడం గమనార్హం. పైగా, ప్రభుత్వ సలహాదారుడి హోదాలో మొత్తం పాలనాయంత్రాంగంను నడిపిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి సహితం అదే జిల్లాకు, సామజిక వర్గానికి చేసిందవారు.
సమీర్ శర్మ తర్వాత ఏపీ కేడర్‌కు చెందిన వారిలో 17 మంది స్పెషల్ చీఫ్ సెక్రటరీలున్నారు. వీరందరిలో.. పూనం మాలకొండయ్య, శ్రీలక్ష్మి, జవహర్ రెడ్డి పేర్లు మాత్రమే తదుపరి సీఎస్ పదవికి వినిపించాయి. జవహర్ రెడ్డి 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.
ఆయన కంటే సీనియర్లయిన నీరభ్‌కుమార్ ప్రసాద్ (1987), పూనం మాలకొండయ్య (1988), కరికాల వలవన్ (1989) సీఎస్ పోస్టును ఆశించినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం… జవహర్‌రెడ్డివైపే మొగ్గు చూపారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు రెండోసారి పొడిగింపు రాకముందు తదుపరి సీఎస్ తానే అని పూనం మాలకొండయ్య (1988 బ్యాచ్) గట్టిగా భావించారు. కానీ.. ఆమెను సీఎంఓ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీగా జగన్ సర్కార్ తాజాగా నియమించింది.
శ్రీలక్ష్మి, జవహర్ రెడ్డి మధ్య తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ జవహర్ రెడ్డి వైపే జగన్ మొగ్గు చూపారు. ఓబుళాపురం గనుల కేసులో శ్రీలక్ష్మిపై అభియోగాలను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఆమె ఈ కేసు సందర్భంగా సంవత్సరంకు పైగా జైలులో కూడా గడిపారు. దీంతో.. సీఎస్ పోస్టు దక్కించుకునేందుకు ఆమెకు లైన్ క్లియర్ అయిందని ప్రచారం జరిగింది.
అయితే పూనం మాలకొండయ్య, శ్రీలక్ష్మి సామర్ధ్యం, అనుభవం, విధేయతలతో అన్నివిధాలా అర్హత గలవారైనప్పటికీ, స్వయంగా ముఖ్యమంత్రి జగన్ కు వారి పట్ల సానుకూలత వ్యక్తం అవుతూ ఉన్నప్పటికీ సామాజిక వర్గం కారణంగా జగన్ సన్నిహితులు మొదటి నుండి వారికి వ్యతిరేకంగా చక్రం తిప్పుతూ వస్తుండటం జరుగుతున్నది.
దానితో జగన్ ప్రభుత్వంలో కేవలం ఒక సామాజిక వర్గంకే తుది ప్రాధాన్యత లభిస్తుందని నిర్ధారణ అయింది. మరో ఏడాదిన్నరలో అసెంబ్లీ ఎన్నికలు జరగవలసి ఉండడం, ముందస్తు ఎన్నికలు జరగగలవనే ప్రచారం కూడా జరుగుతూ ఉండడంతో ఈ సమయంలో సొంత జిల్లాకు చెందిన జవహర్ రెడ్డి పట్ల జగన్ మొగ్గు చూపినట్టు తెలుస్తున్నది.
ఇప్పటి వరకు జవహర్ రెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. అలాగే టీటీడీఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు.రెండు కీలక పదవులలో ఉన్న ఆయనకు ఈ ప్రభుత్వంలో మొదటి నుండి కీలక పదవులే లభిస్తున్నాయి.