మళయాళ సీనియర్ నటుడు మోహన్ లాల్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “ఎల్ 2 – ఎంపురాన్”. దర్శకుడు నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ తెరకెక్కించిన ఈ చిత్రం మళయాళంలో ఒక రికార్డు బ్రేకింగ్ ఓపెనర్ గా నిలిచింది. అయితే ఈ చిత్రం నిన్ననే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి రాగా పార్ట్ 1 లూసిఫర్ రేంజ్ బాల బస్టర్ టాక్ ని మాత్రం తెచ్చుకోలేదు.
అయినప్పటికీ సాలిడ్ బుకింగ్స్ ఈ చిత్రానికి నమోదు అవుతుండగా ఈ సినిమాపై కొన్ని విమర్శలు సోషల్ మీడియాలో సాగుతున్నాయి. అయితే ఈ సినిమాలో స్టార్టింగ్ ఎపిసోడ్ సహా మరికొన్ని సన్నివేశాలు ప్రాపగాండగా కావాలనే చేసినట్టు ఉన్నారు అంటూ పలు మతపరమైన షాకింగ్ కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. దీనితో దర్శకుడు పృథ్వీరాజ్ పై చాలా మంది విమర్శలు కూడా చేస్తున్నారు.