వార్‌ 3 గురించి క్రేజీ అప్డేట్‌!

Wednesday, January 22, 2025

‘ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌’ కాంబోలో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్ సినిమా ‘వార్ 2’. అయితే ఈ సినిమా క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ ఉంటుందని.. ముఖ్యంగా ‘వార్ 3’కి లీడ్ ఈ మూవీ క్లైమాక్స్ లో ట్విస్ట్ రూపంలో రాబోతుందని.. ఈ నెల నాలుగో వారం నుంచి ‘వార్ 2’ క్లైమాక్స్ ను షూట్ చేస్తారని చిత్ర వర్గాల సమాచారం. పైగా ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ లో హృతిక్ రోష‌న్‌ – ఎన్టీఆర్ లతో పాటు ఇతర తారాగణం కూడా పాల్గొనబోతుందంట.

ఇక ఈ మూవీ అప్డేట్స్ కోసం ఇద్దరి హీరోల అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్స్ లో ‘వార్ 2’ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. పైగా ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌ కాంబో అనగానే రెండు తెలుగుఆడియన్స్ లో,ఇటు బాలీవుడ్‌ ఆడియెన్స్‌ లో  కూడా భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పై ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.

అన్నట్టు ‘వార్ 2’ సినిమా కథ విషయానికి వస్తే.. హృతిక్ రోషన్ పాత్రకు దీటుగా ఎన్టీఆర్ పాత్ర ఉంటుందని సమాచారం. పైగా ‘వార్ 2’ అనేది మాస్‌ యాక్షన్ ఫిల్మ్. మరి యాక్షన్ ఫిల్మ్ లో ఎన్టీఆర్ ఏ రేంజ్ నటనతో ఆకట్టుకుంటాడో వేచి చూడాలి. నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles