క్రేజీ టైటిల్‌!

Tuesday, April 1, 2025

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తన కెరీర్ 12వ చిత్రం దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం నుంచి రీసెంట్ గానే వచ్చిన టైటిల్ టీజర్ “కింగ్డమ్” (Kingdom) భారీ హైప్ ని తీసుకొచ్చింది. ఇక ఈ చిత్రం తర్వాత మరో యంగ్ దర్శకుడు రవి కిరణ్ కోలతో మరో క్రేజీ ప్రాజెక్ట్ ని తాను చేయనున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా కూడా అనౌన్సమెంట్ తో మంచి హైప్ ని అందుకోగా ఈ చిత్రం టైటిల్ ఇపుడు బయటకి వచ్చేసింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణం వహిస్తుండగా తాను రీసెంట్ గా జరిగిన ఇంటరాక్షన్ లో విజయ్ తో సినిమా “రౌడీ జనార్ధన” అనే టైటిల్ తో రాబోతుంది అని రివీల్ చేసేసారు. దీనితో ఈ మాస్ అండ్ క్రేజీ టైటిల్ ఇపుడు అభిమానుల్లో సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. అలాగే అభిమానులు కూడా ఎగ్జైట్ అవుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles