జైల్లో దర్శన్‌ కు రాచమర్యాదలు!

Sunday, January 11, 2026

హీరోయిన్ పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు పంపిన యువకుడిని హత్య చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరో దర్శన్‌ ను అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే దర్శన్‌ కు జైల్లో రాచమర్యాదలు లభిస్తున్నట్లు వార్తలు వినిపిస్తుండగా..పైగా ఓ ఫోటో కూడా జైలు నుంచి బయటకు వచ్చింది.

తాజాగా ఆ వార్తలకు ఇంకా బలం చేకూరుస్తూ ప్రస్తుతం ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో దర్శన్ తన స్నేహితుడితో వీడియో కాల్‌ మాట్లాడినట్లుగా కనిపిస్తుంది. పైగా ఆ వీడియో కాల్‌ లోని వ్యక్తి అవతలి వైపు మరో వ్యక్తితో కూడా మాట్లాడినట్లు కనిపిస్తోంది.

25 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోలో దర్శన్‌ మంచి వెలుతురు ఉన్న గదిలో కూర్చొని మాట్లాడుతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ వీడియో వైరల్‌గా మారడంతో కన్నడ పోలీసులకు పెద్దతలనొప్పిగా తయారయ్యింది. మొత్తమ్మీద జైల్లో కూడా దర్శన్‌ రాచమర్యాదలు అందుకోవడం నిజంగా చెప్పుకొదగ్గ విశేషమే. ఈ వీడియో చూసిన నెటిజన్లు పోలీసు శాఖ తీరు పై మండిపడుతున్నారు.

No tags for this post.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles