ఆ వ్యక్తితో ఎఫైర్‌ వల్ల జీవితంలో కోలుకోలేకపోయా!

Wednesday, September 18, 2024

ఆండ్రియా జర్మియా ముందు గాయనిగా ఇండస్ట్రీకి పరిచయం అక్కర్లేదు. తన పాటల ద్వారానే చాలా అవార్డులను అందుకుంది. గాయనిగానే కాకుండా హీరోయిన్ గా కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి నటిగా కూడా మంచి పేరు తెచ్చుకుంది. స్టార్‌ హీరోల పక్కన నటించి తన నటనకు మంచి మార్కులు కొట్టేసింది.

ఇటీవల ఆండ్రియా వెంకటేష్ సైంధవ్ మూవీలో ప్రతినాయకురాలిగా కనిపించి ప్రేక్షకులను మెప్పించింది.అలాగే పలు ఇంటర్వ్యూలో పాల్గొని షాకింగ్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచింది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తాను గతంలో ఓ వ్యక్తి వల్ల పడిన ఇబ్బందుల గురించి చెబుతూ భావోద్వేగానికి గురైయ్యింది.

‘‘ నేను గతంలో ఓ పెళ్ళైన వ్యక్తితో సహాజీవనం చేశాను. అతను నన్ను మానసికంగా, శారీరకంగా చాలా వేధించేవాడు. అవన్నీ భరించలేక పోయాను ఏం చేయాలో అర్థం కాక పదే పదే ఆలోచిస్తూ ఉండేదాన్ని. దీంతో చాలా మానసికి వేదనకు గురై డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. అప్పుడే నేను ఓ పుస్తకం రాశాను. డిప్రెషన్ నుంచి కోలుకోవడానికి ఆయుర్వేద చికిత్స తీసుకున్నాను. ప్రస్తుతం పూర్తిగా కోలుకుని కెరీర్‌పై దృష్టి పెట్టాను. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles