వర్ల డిమాండ్ పరిగణిస్తే.. వారి పని దబిడిదిబిడే!

Monday, July 8, 2024

ఈ దఫా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నాడు ఏపీలో హింసాత్మక సంఘటనలు చాలా పెచ్చరిల్లాయి. కేవలం పోలింగ్ నాడు మాత్రమే కాదు.. ఆ తరువాత చెలరేగిన హింస ఇంకా తీవ్రమైనది. తెలుగుదేశం కూటమికి చెందిన అభ్యర్థుల మీద హత్యాయత్నాలు జరిగాయి. బీభత్సంగా దాడులు జరిగాయి. పల్నాడు, తాడిపత్రి, తిరుపతి ప్రాంతాలు ఇప్పుడు పూర్తిగా పోలీసుల ఆధీనంలో 144 సెక్షన్ కింది నడుస్తున్నాయి. ముగ్గురు ఎస్పీలు మారారు. ఇన్ని పరిణామాలకు మూలహేతువు ఒకటి ఉంటుంది కదా.. అనేది పలువరి అనుమానం. అయితే తెలుగుదేం పార్టీకిచెందిన సీనియర్ నాయకుడు వర్ల రామయ్య ఈసీకి చేసిన ఫిర్యాదు ప్రకారం గమనిస్తే.. కొంతమంది ఉన్నతాధికారుల లోగుట్టు బయటకు వస్తుందని, బండారం బట్టబయలు అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత కూడా.. జగన్ భక్తిని ప్రదర్శించడంలో హద్దులు దాటేసిన అనేక మంది పోలీసు అధికారులమీద ఎన్నికల సంఘం వేటు వేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ క్రమంలో కాస్త ఆలస్యంగా అయినా డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి మీద కూడా వేటు పడింది. అలాగే.. ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు మీద కూడా ఈసీ వేటు వేసింది. వీరు ఎన్నికలతో సంబంధంలేని విధంగా ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు.

అయితే తెదేపా నాయకుడు వర్ల రామయ్య చేస్తున్న ఆరోపణ ఏంటంటే.. సరిగ్గా పోలింగ్ ముందునాడు, పోలింగ్ నాడు, తర్వాతి రోజు కూడా.. ఈ జగన్ భక్త అధికారులు ఎక్కడ ఉన్నారో.. వివరాలు అధికారికంగా సేకరించాలని అంటున్నారు. ఆ మూడు రోజుల్లో వారు ఎక్కడున్నారు.. ఎవరెవరితో మాట్లాడారు.. కాల్ రికార్డులు కూడా తీయాలని అంటున్నారు. రాష్ట్రంలోర హింసాత్మక సంఘటనలు రేగడానికి, పోలీసులు అధికారులు పోలింగ్ నాడు, తర్వాతి పరిణామాల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ కు కొమ్ము కాయడానికి ప్రధాన కారణం.. ఈ అధికారులు వారికి చేసిన సూచనలే అనేది వర్ల రామయ్య చేస్తున్న ఫిర్యాదు. వీరే జిల్లాల్లోని అనేకమంది పోలీసు అధికార్లకు ఫోనుచేసి వారిని వైసీపీ అనుకూలంగా పనిచేసేలా ప్రేరేపించారని అంటున్నారు. ఇప్పుడు మూడు జిల్లాల్లో చెలరేగిన హింస మీద సిట్ బృందాలు ఏర్పడి విచారణ సాగిస్తున్నాయి. ఈ సిట్ విచారణలో వర్ల చెప్పిన కోణం కూడా పరిశీలిస్తే.. డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు తదితర పెద్దల పరిస్థితి దబిడిదిబిడే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles