నిహారికకు బాబాయ్‌ అభినందనలు!

Thursday, January 23, 2025

తెలుగు రాష్ట్రాలను వరదలు అతలాకుతాలం చేశాయి. ఈ వరదల కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధితుల సహాయార్థం ఎన్టీఆర్, ప్రభాస్, చిరంజీవి వంటి స్టార్ హీరోలతో పాటు పలువురు యంగ్ హీరోలు కూడా భారీ విరాళాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే నిహారిక కూడా తనవంతు సాయం చేస్తూ.. బుడమేరు ముంపునకు గురైన పది గ్రామాలకు ఒక్కో దానికి రూ.50వేల చొప్పున రూ.5 లక్షల విరాళాన్ని పవన్‌ కల్యాణ్‌ స్ఫూర్తితో ప్రకటించినట్లు తెలిపింది.

అయితే, తాజాగా నిహారికను అభినందిస్తూ పవన్‌ కళ్యాణ్ ఓ పోస్ట్‌ పెట్టారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో వరద బాధితులను తన వంతు సాయం అందించేందుకు ముందుకు వచ్చి ఒక్కో గ్రామానికి రూ.50వేలు చొప్పున రూ.5 లక్షల విరాళమిచ్చిన నిహారికకు అభినందనలు. కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాలనే మంచి సంకల్పంతో సాయం చేసేందుకు ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇటీవలే పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించేలా ‘కమిటీ కుర్రోళ్లు’తో నిర్మాతగా విజయం సాధించిన నిహారిక భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’ అని పవన్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles