సీఎం రాజనీతి : గాడి తప్పుతున్న వాళ్లను హెచ్చరిస్తూ..

Wednesday, November 6, 2024

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ దఫా చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పార్టీని నాయకులను కాపాడుకోవడం ఎంత ముఖ్యమూ ప్రభుత్వం పట్ల ప్రజల్లో చెడ్డపేరు రాకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం అన్నట్టుగా చంద్రబాబునాయుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అధికారంలో ఉన్నాం కదా అని సొంత పార్టీ నాయకులు ఎక్కడైనా అతి చేస్తున్నట్లయితే వారిని హెచ్చరించి గాడిలో పెడుతున్నారు. అలాంటి వ్యవహారాలు బహిరంగం అయితే.. అంతిమంగా పార్టీకే చెడ్డపేరు కాబట్టి.. గాడితప్పుతున్న వారిని హెచ్చరించడమూ, తిరిగి దారిలోకి తీసుకురావడమూ అనేది గుట్టుచప్పుడు కాకుండా, పార్టీ అంతర్గత వ్యవహారంలాగా సాగిపోతున్నది.

జగన్మోహన్ రెడ్డి సాగించిన అయిదేళ్ల దుర్మార్గమైన పరిపాలన ఫలితంగా..  రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ గాడి తప్పాయి. అధికారంలో ఉన్నది మన పార్టీనే అయితే.. రాష్ట్రాన్ని ఇన్ని రకాలుగా దోచుకోవచ్చునా.. అని ఒక రోల్ మోడల్ లాగా వైసీపీ నాయకులు గత అయిదేళ్లు కాలంలో వ్యవహరించారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత.. ఆ పార్టీ నాయకులు కూడా కొన్నిచోట్ల దారితప్పిపోతున్నారు. స్థానికంగానే దందాలు సాగించడానికి కళ్ల ఎదురుగా ఇసుక వ్యాపారం, లిక్కరు వ్యాపారం ఊరిస్తూ కనిపిస్తున్నాయి. సో, నియోజకవర్గాల్లో తెలుగుదేశం నాయకులు దందాలకు తెరతీశారు.

చాలాచోట్ల ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే అవినీతికి శ్రీకారం  చుడుతున్నట్టుగా వార్తలు వన్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబునాయుడు తన సొంత టీమ్ మీదనే కత్తి దూయాల్సిన అవసరం వస్తోంది. ఎమ్మెల్యేలు, ఇతర స్థానిక నాయకులు కక్కుర్తితో చిన్న చిన్న దందాలకు పాల్పడడం కొనసాగితే.. అంతిమంగా పార్టీ భ్రష్టుపట్టిపోతుందని, ఇప్పుడు దక్కిన సదవకాశం వృథా అవుతుందని ఆయన ఆలోచిస్తున్నారు. అందుకే ఇసుక, లిక్కరు వ్యాపారాల్లో దందాలు సాగిస్తూ చెలరేగుతున్న కొందరు ఎమ్మెల్యేలను, స్థానిక నాయకులనుల పిలిచి తలంటుపోసినట్టుగా తెలుస్తోంది. నియోజకవర్గాల్లో తప్పుడు పనులు చేస్తున్నట్టుగా తన దృష్టికి వస్తే ఏమాత్రం ఉపేక్షించబోయేది లేదని హెచ్చరించినట్టుగా అమరావతి వర్గాలు పేర్కొంటున్నాయి.

చంద్రబాబు హెచ్చరికల ఫలితం నియోజకవర్గాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఫరెగ్జాంపుల్.. ఇసుక ఉచితం అని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. ప్రతి ట్రాక్టరు మీద కనీసం వెయ్యిరూపాయలు ఎమ్మెల్యే మనుషులు వసూలు చేయడం అనే దందా కొన్నిచోట్ల కొనసాగింది. ఇప్పుడు ఆ పద్ధతి మారింది. చంద్రబాబు మాటలను చెవిన వేసుకున్న లోకల్ నేతలు.. తమ తీరు మార్చుకుంటున్నారని.. దందాలు తగ్గుతున్నాయని తెలుస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles