గుండె తలుపులు మూసి..వెలుతురు కోసం వెతుకుతున్నా!

Saturday, January 18, 2025

 కమల్ హాసన్ కూతురుగా శృతి హాసన్ ఇండస్ట్రీకి ఎంట్రీ అయిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో వరుస చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. అయితే ఈ అమ్మడు శాంతను హజారికాతో కొద్ది రోజులు డేటింగ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. నిత్యం అతనితో ఉన్న ఫొటోలు షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేసింది. అవి కాస్త వైరల్ కావడంతో.. వాటిని చూసిన వారంతా వీరిద్దరు పెళ్లి చేసుకుంటారని ఫిక్స్ అయ్యారు.

కానీ ఇటీవల మనస్పర్థలు రావడంతో బ్రేకప్ చెప్పుకుని విడిపోయారు. ఈ విషయాన్ని తెలుపుతూ శృతి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా పెట్టింది. ఇదిలా ఉంటే.. తాజాగా, శృతి హాసన్ బ్రేకప్ అయిన కొద్ది రోజులకే ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. గుండె తలుపులు మూసేశాను.. ప్రేమ అనే తాళంతో దాన్ని తెరవాలనుకోవడం లేదు. నా ఉచిత రచనను తిరిగి ప్రారంభించడం చాలా ఉత్ప్రేరకంగా అనిపిస్తుంది. నేను వెలుతురు కోసం వెతుకుతున్నా. గందరగోళ చెరువులో ఈదుకుంటూ దిగువకు ఉన్నాను. నాకు బురద నాచు కలిసి ఉన్న మొత్తం పాట దొరికింది. జీవితం అద్భుతమైనది, భయానకమైనది, అందమైన మాయాజాలం. అందులో ప్రతి బిట్ విలువైనది’’ అంటూ  రాసుకొచ్చింది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles