మాస్‌ డైరెక్టర్‌ తో క్లాస్‌ హీరో సినిమా!

Saturday, December 21, 2024

టాలీవుడ్‌ యంగ్‌ హీరోల్లో శర్వానంద్‌ ఇటీవలే మనమే సినిమా తో ఆడియెన్స్‌ ను పలకరించాడు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాని శ్రీరామ్‌ ఆదిత్య తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పై ఎన్నో అంచనాలు, ఆశలు పెంచుకున్న శర్వా…కానీ ఈ సినిమా మాత్రం ఆడియెన్స్‌ నుంచి మిక్స్‌డ్‌ రెస్పాన్స్‌ అందుకుంది.

బాక్సాఫీస్ వద్ద యావరేజ్ చిత్రంగా నిలిచింది. చాలా కాలంగా హిట్ లేని శర్వానంద్ కు ‘మనమే’ నిరాశనే మిగిల్చింది. కాగా శర్వా ఎలాగైనా మళ్లీ ఎక్స్ ప్రెస్ రాజా, శతమానంభవతి రేంజ్ హిట్టు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ దశలో చాలా  కథలు వింటున్నాడు. ఈ ప్రాసెస్ లో మాస్ డైరక్టర్ సంపత్ నంది చెప్పిన కథకు శర్వా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సంపత్ నంది లాస్ట్ హిట్ గోపిచంద్ కలయికలో వచ్చిన చిత్రం సిటీమార్.

2021లో వచ్చిన ఈ మూవీ తర్వాత సంపత్ నుండి కూడా ఏ సినిమా రాలేదు. శర్వా కోసం పవర్ఫుల్ కథ రెడీ చేసాడని ఈ చిత్రంతో ఈ కుర్ర హీరో గ్యారెంటీ బౌన్స్ బ్యాక్ ఇస్తాడని సమాచారం. శర్వా,సంపత్ ల చిత్రాన్నీ భారీ బడ్జెట్ పై సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె రాధామోహన్ నిర్మించబోతున్నారు. త్వరలో ఇందుకు సంభందించి అధికార ప్రకటన రాబోతుంది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles