అనిల్ మూవీకి కడుపుబ్బా నవ్వుతున్నా అంటున్న చిరు! విశ్వక్ సేన్ ‘లైలా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి తన కొత్త సినిమా గురించి క్రేజీ అప్ డేట్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ మాట్లాడుతూ.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తాను ఓ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ లో చేయబోతున్నట్లు చిరు క్లారిటీ ఇచ్చారు. ఆ చిత్రం వేసవిలో ప్రారంభమవుతుందని చిరు తెలిపారు. ‘పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని.. ఆ మూవీ సెట్స్‌లో అడుగుపెట్టేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని చిరు వెల్లడించారు. అనిల్ రావిపూడి చెప్పే సీన్స్ గురించి కూడా మెగాస్టార్ చెబుతూ.. ‘సినిమాలో ఆ సన్నివేశాల గురించి అనిల్ రావిపూడి నాకు చెబుతుంటే కడుపుబ్బా నవ్వుతున్నాను. దర్శకుడు కోదండ రామిరెడ్డితో పని చేసిన సమయంలో ఎలాంటి ఫీలింగ్ ఉందో.. ఇప్పుడు అనిల్‌తో అలాంటి ఫీలింగే ఉంది. ఈ సినిమా కచ్చితంగా అభిమానులకు నచ్చుతుంది’ అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.