మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా అలాగే మరింతమంది టాలెంటెడ్ నటీనటులు నటిస్తున్న అవైటెడ్ భారీ ఫాంటసీ చిత్రమే “విశ్వంభర”. మరి ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం కోసం మెగా అభిమానులు ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఉన్నారు. మరి వాటికి తగ్గట్టుగానే మేకర్స్ గ్రాండ్ ప్లానింగ్స్ ఈ సినిమాకి చేస్తుండగా ఇపుడు ఓ సాలిడ్ అప్డేట్ కోసం అయితే మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఒక ఇంట్రెస్టింగ్ టాక్ ఈ చిత్రంపై ఇపుడు వినిపిస్తుంది. దీనితో ఈ సినిమా కోసం చిరు గాయకునిగా మారనున్నారని తెలుస్తుంది. చిరు గతంలో పలు సినిమాలకి పాటలు పాడిన సంగతి తెలిసిందే. పాటలతో పాటుగా పాటల్లో కొన్ని కొన్ని డైలాగ్స్ తో మాట సాయం అందించిన సినిమాలు కూడా చాలానే కనిపించాయి.
మరి ఇపుడు విశ్వంభర కోసం చిరు మరో సారి ఈ స్టెప్ తీసుకోనున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.