మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రెస్టీజియస్ చిత్రం ‘విశ్వంభర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు మొదలు అయ్యాయి. ఈ సినిమాను దర్శకుడు వశిష్ట పూర్తి సోషియో ఫాంటసీ చిత్రంగా తీర్చిదిద్దుతున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వార్తలు వచ్చినా అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.
అయితే, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉండనుందని.. ఇందులో చిరంజీవి ఏకంగా ఆరుగురు రాక్షసులతో యుద్ధం చేస్తాడని.. ఇది వీఎఫ్ఎక్స్ అంశాలు ప్రేక్షకులకు వావ్ ఫ్యాక్టర్ ఇస్తుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ నిర్మాణం వహిస్తున్నారు.