చిరంజీవి మాజీ అల్లుడు కన్నుమూత!

Monday, December 23, 2024

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మొదటి మాజీ భర్త శిరీష్‌ భరద్వాజ్‌ కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతుండడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన బుధవారం ఉదయం కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు. శిరీష్‌ 2007 లో శ్రీజను ప్రేమించి వివాహం చేసుకున్నాడు.

ఆ తరువాత వారికి ఓ పాప కూడా పుట్టిన తరువాత మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తరువాత శ్రీజ కల్యాణ్‌ దేవ్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకుని ఓ పాపకు జన్మనిచ్చింది. ఇటు శిరీష్‌ కూడా మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles